RRR : మారిపోయిన వర్మ.. సినిమా మీద ఆసక్తికర వ్యాఖ్యలు.. మోక్షం కలిగించారు అంటూ!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR ఇండియన్‌ సినిమా రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొడుతూ ముందుకు వెళుతోంది. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ సినిమా మీద అటు ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు హీరోలు దర్శకులు సినిమా అద్భుతంగా ఉందని తమ తమ స్పందన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి వాటిలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చి చేరాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద వర్మ ఎలాంటి కామెంట్ చేస్తాడు అంటూ అందరూ ఎదురు చూడగా దాని మీద ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. వివరాల్లోకి వెళితే

మరింత దగ్గరగా

మరింత దగ్గరగా

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో రామ్ చరణ్ తేజ అల్లూరిసీతారామరాజు పాత్రలో నటించిన తాజా చిత్రం RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియాభట్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల అద్భుత నటన సినిమాను ప్రేక్షకులకు తీసుకు వెళ్ళింది .

RRR మేనియా

RRR మేనియా

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా RRR మేనియా నడుస్తోంది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబడుతోంది. సినిమా చూసిన తర్వాత సామాన్యుల మాత్రమే కాదు వారితో పాటు సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా RRR మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం RRR సినిమాను పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

వర్మ కూడా

వర్మ కూడా

తాజాగా ఈ జాబితాలోకి సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా వచ్చారు. ప్రతీ అంశంపై అందరిలా కాకుండా కాస్త భిన్నంగా స్పందించే రామ్‌గోపాల్‌ వర్మ RRR సినిమా విషయంలో మాత్రం అందరిలాగే ప్రశంసల వర్షం కురిపించిన ఆసక్తికరంగా మారింది. RRR సినిమాను ప్రశంసిస్తూ వర్మ పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఈ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

 మోక్షం కల్పించిన గొప్ప వ్యక్తి

మోక్షం కల్పించిన గొప్ప వ్యక్తి

అందుకే బాహుబలితో RRR సినిమాను పోల్చుతూ వర్మ చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమా చూసిన రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్ చేస్తూ.. ‘బాహుబలి - 2 అనేది చరిత్ర అయితే, ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది చరిత్రాత్మకం. రాజమౌళి బాక్సాఫీస్‌కు మోక్షం కల్పించిన గొప్ప వ్యక్తి' అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Recommended Video

KGF Chapter 2 : Kannada And Telugu Ruling Indian Box Office | RRR Movie | Filmibeat Telugu
 వైరల్ గా ట్వీట్

వైరల్ గా ట్వీట్

దీంతో ప్రస్తతం సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఎప్పుడూ నెగిటివ్‌ కామెంట్స్‌ చేసే వర్మ ఇలా ఓ సినిమాపై ఇంత పాజిటివ్‌గా రెస్పాండ్‌ కావడం పట్ల సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఆనందిస్తున్నారు.. సాధారణంగా వారు ఎప్పుడూ కూడా ఈ విధంగా ఏ ఇతర సినిమా మీద కూడా రెస్పాండ్ అవ్వడు. ఈ సినిమా మీద మాత్రమే అలా రెస్పాండ్ అయ్యారు మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X