బాలయ్యలో నాకు ఎన్టీఆర్ కనిపించలేదు.. ఆయన కొడుకు కాబట్టే.. ఆర్జీవీ!
Recommended Video

రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి పోటీగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ని టీజర్ రూపంలో విడుదల చేశారు. ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న ఆ నటుడు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ బాలయ్య బయోపిక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాటక రంగానికి చెందిన వ్యక్తి
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న నటుడి గురించి వర్మ వివరించాడు. అంతా అనుకుంటున్నట్లుగా అతడిని బాలీవుడ్ నుంచో, మరో చిత్ర పరిశ్రమ నుంచో తీసుకురాలేదని అన్నారు. ఆయన వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి. నాటక రంగంలో ఉంటున్నారు. ఆయన్ని తీసుకుని వచ్చి ఎన్టీఆర్ లాగా ఎలా డైలాగులు చెప్పాలి, హావ భావాలూ ఎలా పలికించాలి అనే విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చామని వర్మ తెలిపాడు.

ఎన్టీఆర్ కొడుకు కాబట్టే
లయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి మాట్లాడుతూ.. బాలయ్య ఎన్టీఆర్ తనయుడు కాబట్టి ఆయనలో కొన్ని పోలికలు ఉంటాయి. నేను ఎన్టీఆర్ కథానాయకుడు చూడలేదు కానీ ట్రైలర్ చూశా. ట్రైలర్ లో నాకు ఎక్కడా ఎన్టీఆర్ ని చూసిన ఫీలింగ్ కలగలేదు. బాలయ్యలో ఎన్టీఆర్ హావభావాలు కనిపించలేదు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మాత్రం ఎన్టీఆరే దిగివచ్చారా అనేంతగా ఉంటుందని వర్మ తెలిపాడు.

ఆ పీరియడ్‌లోనే
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్టీఆర్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి వైస్రాయ్ హోటల్ ఘటన, అయన మరణం వరకు ఉంటుందని వర్మ తెలిపాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ దాదాపుగా అన్ని రోజులు ఒకే మానసిక వేదనతో ఉన్నారు. ఈ అంశాలపైనే చిత్రం ప్రధానంగా ఉంటుంది. లక్ష్మి పార్వతి పాత్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వర్మ తెలిపాడు.

ట్రైలర్ ఎప్పుడంటే
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ని జనవరి చివరి వారంలో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ విడుదల చేస్తాం అని వర్మ తెలిపాడు. ఈ చిత్రంలో తెలిసిన నటీనటులు ఎవరూ లేరు. అంతా కొత్త వాళ్లనే తీసుకున్నాం అని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఒడిదుడుకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన అందరి పాత్రలు ఈ చిత్రంలో ఉంటాయని వర్మ తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











