పొలిటిషియన్‌గా పవన్ కల్యాణ్ ఎందుకు ఇష్టమంటే .. నాకు ఆ కెపాసిటీ లేదు.. రాంగోపాల్ వర్మ

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు సంధించే ఆయన తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడని చెప్పారు. ఇంకా పవర్‌స్టార్ గురించి పలు రకాలుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వర్మ ఏం చెప్పారంటే..

సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి

పవన్ కల్యాణ్ నాకు ఇష్టమెందుకంటే..

పవన్ కల్యాణ్ నాకు ఇష్టమెందుకంటే..

తెలుగు రాష్ట్రాల్లో నాకు నచ్చిన పొలిటిషియన్ పవన్ కల్యాణ్. రాబోయే రోజుల్లో రాజకీయ వేత్తగా ఆయనకు పేరు వస్తుందో లేదో తెలియదు. ఆయనకు ఇంకా అధికారం రాలేదు. కానీ ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన చూడటానికి బాగా ఉంటారు. డైరెక్టర్‌గా నాకు ఓ విజువల్ సెన్స్ ఉంది. కాబట్టి ఆయన నాకు ఇష్టం. పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేస్తాడనే నాకు పెద్దగా ఆసక్తి లేదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

పవన్ కల్యాణ్ ఆఫర్ ఇస్తే..

పవన్ కల్యాణ్ ఆఫర్ ఇస్తే..

పవన్ కల్యాణ్ నాకు సినిమా తీయమని ఆఫర్ ఇస్తే.. నేను ఆయనతో సినిమా చేయను. ఆయనను ఓ మనిషిగా ఇష్ణపడుతాను. ఆయన సూపర్ స్టార్. అతడితో సినిమా తీసే కెపాసిటీ లేదు. ఆయనతో సినిమా అంటే చాలా అంశాలు, కమర్షియల్ విలువల గురించి ఆలోచించాలి. ఆ కెపాసిటీ నాకు లేదు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

 పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంచనాలు..

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంచనాలు..

పవన్ కల్యాణ్‌కు అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఆయనపై అంచనాలు భారీగా ఉంటాయి. అభిమానులు ఎక్కువగా ఆశిస్తారు. డైలాగ్స్, కొన్ని కమర్షియల్ సీన్లు లాంటి గొడవ ఉంటుంది. కాబట్టి నేను ఆయనను హ్యాండిల్ చేయలేను. కథలు, సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తాను. నేను సూపర్ స్టార్స్‌తో సినిమా చేయలేను. కేవలం యాక్టర్లతో మాత్రమే సినిమాలు చేస్తాను అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

 వైఎస్ జగన్ గురించి సినిమా తీస్తా

వైఎస్ జగన్ గురించి సినిమా తీస్తా

పవన్ కల్యాణ్‌తో కాకుండా సినిమా తీయాల్సి వస్తే.. వైఎస్ జగన్ గురించి సినిమా చేస్తాను. అది ఎలా ఉంటుందో తెరపైన మాత్రమే చూడాలి. ఆ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేను. ఆ సమయం వచ్చినప్పుడు అఫీషియల్‌గా ప్రకటిస్తాను. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే అని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.

Recommended Video

Ys Jagan పై మూవీ ఉంటుంది, Pawan Kalyan ని హ్యాండిల్ చెయ్యలేను - RGV || Filmibeat Telugu
 దావూద్ ఇబ్రహీం జీవిత కథతో ఆర్జీవీ

దావూద్ ఇబ్రహీం జీవిత కథతో ఆర్జీవీ

రాంగోపాల్ వర్మ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రాజశేఖర్‌తో దెయ్యం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం జీవిత కథతో డీ కంపెనీ అనే అతిపెద్ద వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన 4 నిమిషాల వీడియోను మే 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X