twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యకు వర్మే నో చెప్పాడా.. 'ఎన్టీఆర్' నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే!

    |

    Recommended Video

    Ram Gopal Varma Reveals Why He Did't Direct Balayya's NTR Biopic

    నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ని ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చేపట్టిన ఎన్నికల ప్రచారం, ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన పరిణామాలని చూపించారు. అంతకు ముందే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలై హాట్ టాపిక్ గా మారింది. ఓ టివి చర్చా కార్యక్రమంలో ఎన్టీఆర్ మహానాయకుడుపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ముందుగా వర్మకే

    ముందుగా వర్మకే

    బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రకటించగానే దర్శకుడిగా మొదటి వినిపించిన పేరు రాంగోపాల్ వర్మ. కానీ అనూహ్యంగా ఈ చిత్రం మరో దర్శకుడి చేతుల్లోకి వెళ్ళింది. వర్మ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నాడో కారణాలు బయటకు రాలేదు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ గురించి ఓ ఛానల్ లో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ డిబేట్ లో తాను ఎందుకు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో వర్మ వివరించాడు.

    మహాత్మాగాంధీ ఉదాహరణగా

    మహాత్మాగాంధీ ఉదాహరణగా

    మహాత్మాగాంధీ బయోపిక్ తీయాలని భావిస్తే.. ఆయన్ని ట్రైన్ లోనుంచి తోసేసిన సంఘటన మొదలుకుని బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చిన వరకు చూపించాయి. గాంధీ జీవితంలో సినిమాటిక్ డ్రామా మొత్తం ఆ పీరియడ్ లోనే ఉంది. బ్రిటిష్ వారు అనే విలన్ కూడా సినిమాకు ఉంటుంది. ఈ అంశాన్ని వదిలేసి గాంధీ ఎలా పుట్టారు, ఎలా పెరిగారు లాంటి సన్నివేశాలని చూపిస్తే బయోపిక్ కు అర్థం లేదని వర్మ తెలిపారు.

    అలాగే ఎన్టీఆర్

    అలాగే ఎన్టీఆర్

    అదే విధంగా ఎన్టీఆర్ జీవితంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కీలక దశ ప్రారంభమైంది. లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం అనేది ఇంకా కీలకం. ఈ అంశాలని వదిలేసి సినిమాల్లో ఎలా రాణించాడు అనే కథ అంత ఆసక్తిగా ఉండదని వర్మ అభిప్రాయ పడ్డాడు. అందుకే తాను ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్నట్లు వర్మ తెలిపారు.

     దూసుకుపోతున్న ట్రైలర్

    దూసుకుపోతున్న ట్రైలర్

    వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన అన్ని వివాదాస్పద రాజకీయ అంశాల్ని వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చూపించబోతున్నారు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు వర్మ చెబుతున్నాడు.

    English summary
    Ram Gopal Varma reveals why he did't direct Balayya's NTR biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X