పవన్ కళ్యాణ్‌పై ఎక్కువ విమర్శలు కారణం చెప్పిన రామ్ గోపాల్ వర్మ... చిరంజీవితో పోల్చుతూ సెన్సేషన్
మెగా బ్రదర్స్, పొలిటిషన్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కొన్ని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవితో పవన్ కళ్యాణ్‌ను పోల్చిన ఈ వివాదాస్పద దర్శకుడు తనదైన కోణంలో పవర్ స్టార్‌ని కామెంట్ చేశాడు. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇంతకీ వర్మ ఏమన్నాడు? వివరాల్లోకి పోతే..

వర్మ తాజా సినిమా.. సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ
రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. ఈ సినిమాపై కేసులు, నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వర్మ. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పవన్, చిరంజీవి ఇష్యూలో వేలుపెట్టాడు.

పవన్‌పై ఎక్కువ విమర్శలు.. కారణం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవి గురించి ప్రస్తావించిన రామ్ గోపాల్ వర్మ.. పవన్ పై ఎక్కువ విమర్శలు రాడానికి గల కారణాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో వర్మ మాట్లాడిన తీరు పవన్ అభిమాన వరంగల్లో ఆగ్రహ జ్వాలలు నింపింది.

పవన్ కళ్యాణ్, చిరంజీవి వ్యక్తిత్వాలు
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమే అతని పై వస్తున్న విమర్శలకు కారణమని వర్మ అన్నాడు. ఆయన వ్యక్తిత్వమే ట్రోల్ చేసే విధంగా ఉంటుందని, అతడి వ్యవహార శైలి ట్రోలింగ్‌కి ఎక్కువగా అవకాశం కల్పిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ వివాదాస్పద దర్శకుడు. అదే చిరంజీవిని ట్రోల్ చేసే అవకాశమే ఉండదని, అతడి వ్యక్తిత్వం గొప్పదని వర్మ స్పష్టం చేశారు.

మెగా సోదరుల అభిమాన వర్గాల్లో చిచ్చు పెట్టేలా వర్మ..
మనం ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో, వారి వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకొని ట్రోల్ చేసే అవకాశం ఉంటుందని వర్మ చెప్పుకురావడం విశేషం. అయితే మెగా సోదరుల విషయంలో ఇలా వర్మ చేసిన కామెంట్స్ వారి వారి అభిమానులకు కోపం తెప్పించాయి. మెగా సోదరుల అభిమాన వర్గాల్లో చిచ్చు పెట్టేలా వర్మ ఇలా కామెంట్స్ చేస్తుండటం బాధాకరమని అంటున్నారు నెటిజన్లు.
Recommended Video

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
మొత్తానికి ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వర్మ అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్లుగా ఆ పరిస్థితి ఉందని తెలుస్తోంది. తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ సినిమా విడుదలను ఆపడం జరిగింది.


Click it and Unblock the Notifications











