కేటీఆర్..మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడి.. వర్మ ట్వీట్ వైరల్
రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వేసే ట్వీట్లు, అందులోని పరమార్థం మాత్రం ఎవ్వరికీ అంత ఈజీగా అర్థం కాదు. అలాంటి వర్మకు కేటీఆర్ ఇచ్చిన పంచ్ అదిరిపోయింది. ఆర్జీవీకే దిమ్మతిరిగే పంచ్ఇవ్వడంతో నెటిజన్స్ అంతా షాక్ అయ్యారు. ఆ పంచ్‌కు వర్మ ఎలా స్పందిస్తాడా? అంతా ఎదురుచూశారు. తాజగా వర్మ ఓ ట్వీట్ వేశాడు. అదేంటో ఓ సారి చూద్దాం.

ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు..
ఆర్జీవీ వేసే ఒక్కో ట్వీట్ అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. సామాజిక సమస్యలు, కరెంట్ అఫైర్స్, మెగా ఫ్యామిలీ ఇలా ప్రతీ అంశంపైనా వర్మ సెటైరికల్‌గా స్పందిస్తాడు. ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ మీద వేసే ట్వీట్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ట్విట్టర్‌లో వర్మ దూకుడుగానే ఉంటాడు తప్పా వెనక్కి తగ్గడు.

నెటిజన్లతో చిట్ చాట్..
ఓ వైపు కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు పోరాటం, ప్రజల కష్టాలకు స్పందించి వారికి సాయం చేయడంలో బిజీగా ఉండే కేటీఆర్ నెటిజన్లతో ముచ్చటించాడు. అందులో భాగంగా వర్మ ఓ చిలిపి ప్రశ్నను సంధించాడు. దానిని కేటీఆర్ కూడా తనదైన హాస్యాన్ని జోడించి అదిరిపోయే పంచ్ వేశాడు.
వర్మ ట్వీట్ కేటీఆర్ రిప్లై..
కరోనా సమయంలో మందుబాబుల పరిస్థితిని పరోక్షంగా చెబుతూ.. ‘ఇళ్లల్లో ఉంటున్న వాళ్లు ఏం చేయాలో తెలియక జట్టు పీక్కుంటున్నారు. చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారు. మెంటల్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఫస్ట్రేషన్ లో కొందరు భర్తలు భార్యల్ని కొడుతున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతలా పెద్ద మనసు చేసుకొని మాకు చీర్స్ చెప్పండ'ని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన కేటీఆర్.. రాముగారు మీరు అడుగుతోంది హెయిర్ కట్ గురించే అనుకుంటున్నా.. అంటూ రిప్లై ఇచ్చాడు.

మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడైపోయింది..
ఇక ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ..‘రామూ గారూ.. హెయిర్ కట్ గురించే అడుగుతున్నారు కదా' అంటూ చమత్కరించారు. కాగా, కేటీఆర్ రిప్లైపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'కేటీఆర్ సర్.. నేను మీరు ఇచ్చిన రిప్లైను గుర్తించలేదు. మీలో ఉన్న హాస్య చతురత నాకు చాలా ఇష్టం. మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడైపోయింది. ప్రస్తుతం మీ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిది'అంటూ ట్వీట్ చేశారు. దీంతో మొదటి సారి వర్మ లొంగినట్టైంది. ఈ ఘనత కేటీఆర్‌కు చెల్లుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











