వర్మ కొత్త చిత్రం '365 డేస్' టీజర్(వీడియో)
హైదరాబాద్: కత్తులు, తుపాకులు, గ్యాంగ్ స్టర్లు, టెర్రరిస్టులు, దెయ్యాలు, భూతాలు నేపధ్యంలోనే తన పాతికేళ్ల కెరీర్ లో ఎప్పుడూ సినిమాలు తీసారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల్లోని పాత్రలు అయితే క్రిమినల్స్...లేదా క్రిమినల్ సిట్యువేషన్స్ లో ఉండటమే జరుగుతూంటాయి. అడపాదడపా ఏమైనా రొమాంటిక్ సినిమాలు తీసినా అవి ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లోనే, లేక ఏదో థ్రిల్లర్ ఎలిమెంట్ బ్యాక్ గ్రౌండ్ లోనో రూపొందుతాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అలాంటి రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఒక ఫుల్ ప్లెడ్జెడ్ లవ్ స్టోరీ తీసాడు. ఈ సినిమాలో వయెలెన్స్ అనేది మచ్చుకు కూడా లేకపోవటం వలన ఇప్పటివరకూ రామ్ గోపాల్ వర్మ తీసిన మిగతా సినిమాలన్నిటిలోనూ ప్రత్యేకంగా నిలవనుంది. ఈ చిత్రం పేరు 365 డేస్. ఈ టీజర్ ని విడుదల చేసారు. మీరూ ఓ లుక్కేయండి.
పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుంది అనే అంశం నేపధ్యంలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో విడుదలకి సిద్దమవుతోంది. 365 డేస్ ఫస్ట్ లుక్ ఈనెల 14న వాలంటైన్స్ సందర్బంగా రిలీజ్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రాల విషయానికి వస్తే...
సంచలనం సృష్ఠించిన నిజ జీవిత కథలను ఎంచుకుని వాటిని సినిమాలుగా మార్చడంలో వర్మది అందెవేసిన చేయి. ముంబయి దాడుల ఉదంతంతో అటాక్స్ ఆఫ్ 26/11 తెరకెక్కించిన విషయం తెలిసిందే. అనేక విమర్శల మధ్య విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. బెజవాడ నేపథ్యంతో తెరకెక్కించిన బెజవాడ రౌడీలు సినిమా అనేక విమర్శల తర్వాత 'బెజవాడ'గా పేరుమార్చి విడుదల చేశారు. నిజ జీవిత నేపథ్యంతో రక్త చరిత్ర, రక్త చరిత్ర2, బెజవాడ రౌడీలు,అటాక్స్ ఆఫ్26/11 రూపొందించాడు వర్మ.
ఇప్పుడు అదే కోవలో ఓ నిజ జీవిత నేపథ్యంలో ఓ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతి ఆదారంగా సినిమా తీసేపనిలో ఉన్నట్లు తెలుస్తుంది.మొదట ఆత్మ హత్య అనుకున్నా ఆమెది హత్య అనే తేలింది. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద గత ఏడాది అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసుపై వర్మ కూడా స్టడీ చేస్తున్నట్లు సమాచారం. సునంద కేసు ఓ కొలిక్కి రాగానే సినిమా ప్రారంభిస్తారని వినికిడి.


Click it and Unblock the Notifications











