రామ్ గోపాల్ వర్మ సినిమాకు సెన్సార్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా బ్యూటిఫుల్. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ట్యాగ్ లైన్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. చిత్రంలో నైనా హీరోయిన్ గా నటించగా, సూరి హీరోగా నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా A సర్టిఫికెట్ పొందింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పిన చిత్రయూనిట్ .. అతిత్వరలో విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని పేర్కొంది. రొమాంటిక్ ప్రేమ కథగా వైవిధ్య భరితమైన సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త లోకం పరిచయం చేయనున్నాం అని అంటున్నారు యూనిట్ సభ్యులు.

మరోవైపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సెన్సార్ కష్టాలు ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని అంటున్నారు సెన్సార్ సభ్యులు. దీంతో నవంబర్ 29నే విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. చూడాలి మరి వర్మ బ్యూటిఫుల్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఏయే తేదీల్లో విడుదలవుతాయి అనేది. ఈ రెండు సినిమాలతో గత కొని రోజులుగా వర్మ అంశం హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











