Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వర్మ సంచలన నిర్ణయం.. నాలుగు భాషల్లో తన లేటేస్ట్ మూవీ!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇటీవల కాలంలో సక్సెస్ అందుకొన్న దాఖలాలు లేవు. హిట్టు కొట్టి మళ్లీ తన సత్తాను నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సారి భైరవగీతతో ముందుకొస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాదు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తాడు.
బైరవ గీత చిత్రాన్ని తొలుత తెలుగు, కన్నడలో విడుదల చేయాలని నిర్ణయించుకొన్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తునట్టు తెలిసింది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన భైరవ గీత సినిమాను అభిషేక్ పిక్చర్స్ విడుదల చేస్తున్నది. ఈ నెల 26న భైరవగీత థియేటర్లలో సందడి చేయనున్నది. ఈ చిత్రంలో ధనుంజయ, ఇర్రా మోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
భైరవ గీత చిత్రంలో నటిస్తున్న ఇరా అనే కొత్త హీరోయిన్ చాలా బోల్డ్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ చిత్రం కోసం నిర్వహించిన యాక్టింగ్ వర్క్‌షాప్‌లో ఇరా తన ప్రతిభతో రాంగోపాల్ వర్మను కట్టిపడేసింది. ఈమె అందం, అభినయంపై ఇటీవల కాలంలో ఎక్కువగానే ప్రశంసలు గుప్పిస్తున్నాడు.
నూతన దర్శకుడు సిద్ధార్థ రూపొందిస్తున్న ఈ చిత్రం భూస్వాములకు, పేదవర్గాలకు జరిగే పోరాటంలో ఓ వ్యక్తి ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది చిత్ర కథ. వర్మ మార్కు చిత్రంగా హింసాత్మకంగా సాగుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.