వర్మకు సెన్సార్ ఝలక్.. భైరవ గీత గురించి చెప్పిందంతా అబద్ధమా?
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పిస్తున్న భైరవ గీత ఓ వారం సినిమా వాయిదా పడటం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ మూవీ నవంబర్ 29న విడుదల కావాల్సింది. కానీ ఓ వాయిదా వేసి డిసెంబర్ 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే భైరవగీత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇదేనట.

రోబో 2.0 మూవీకి పోటీగా
ముందస్తుగా ప్లాన్ చేసిన ప్రకారం భైరవ గీత మూవీని రోబో 2.0 పోటీగా రిలీజ్ చేస్తున్నామని వర్మ ప్రకటించారు. శంకర్ 2.0 సినిమాను చిన్న పిల్లల కోసం తీస్తే.. తాము పెద్దలకు మాత్రమే సినిమాతో వస్తున్నాం అని వర్మ ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆ సినిమాను డిసెంబర్ 7 తేదీకి వాయిదా వేశారు.

డిసెంబర్ 7న రిలీజ్
కన్నడ, తెలుగు వెర్షన్లలో డిసెంబర్ 7న రిలీజ్ చేయాలని ప్రకటించినప్పటికీ టాలీవుడ్‌లో విడుదల కాలేదు. ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకొంటున్నాం. 2.0తో హాల్స్ ఎక్కువగా దొరకలేదు. ఇంకా ప్రమోషన్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అందుకే తెలుగులో భైరవగీతను విడుదల చేయలేకపోతున్నాం అని వర్మ ట్వీట్ చేశారు.

సెన్సార్ ఇబ్బందులే కారణం
అయితే భైరవ గీత రిలీజ్ కాకపోవడానికి సెన్సార్ ఇబ్బందులే కారణం అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. గడువు లోపల జంతు సంరక్షణ బోర్డు నుంచి నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించలేదు. ప్రతీ సినిమాకు అలాంటి సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ కారణంగా సెన్సార్ ఇబ్బందులు వచ్చాయి. దాంతో సినిమా విడుదలకు అడ్డంకి ఏర్పడింది.

వర్మ భైరవ గీత మూవీని చూసి
కన్నడలో రిలీజైన భైరవగీత చిత్రాన్ని ఇటీవల బెంగళూరులోని సంతోష్ థియేటర్‌లో హీరో ధనుంజయ, డైరెక్టర్ సిద్ధార్థ శంకర్‌తో కలిసి రాంగోపాల్ వర్మ వీక్షించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి సంతోషంలో మునిగిపోయారు. ఈ సినిమా సక్సెస్‌ను చిత్ర యూనిట్‌తో కలిసి పంచుకొన్నారు.

హీరోయిన్ ఇరా మోర్ గురించి
భైరవగీత రిలీజ్ సందర్భంగా హీరోయిన్ ఇరా మోర్ గురించి వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నేను, ధనుంజయ్, సిద్ధార్థ్ నిన్ను మిస్ అవుతున్నాం. భైరవ గీతకు వస్తున్న రెస్సాన్స్ చూస్తే నీవు కూడా నమ్మలేవు. నీతోపాటు భైరవ గీతకు పనిచేసినందరికీ శుభవార్త. మీ శ్రమకు చక్కటి ఫలితం లభించింది అని వర్మ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











