జగన్ ఓటమిపై రామ్ గోపాల్ వర్మ, పంచ్ అదిరింది!
హైదరాబాద్: దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ రాగా, తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ, సీమాంధ్ర ప్రాంతంలో తెలుగు దేశం పార్టీలు విజయం సాధించాయి.

గెలిచిన వారంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే...ఓడిన అభ్యర్థులు అందుకు గల కారణాలను విశ్లేషించుకుంటూ విషాదంలో మునిగిపోయారు. ఇక ఎన్నికల ముందు గెలుపు మాదే అంటూ హడావుడి చేసిన వారిపై సెటైర్లు సైతం పేలుతున్నాయి. జగన్ పార్టీపై, కాంగ్రెస్ పార్టీపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా....ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ పేజీలో జగన్ గురించిన చేసిన పోస్టు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లు ఓదార్పు యాత్ర చేసిన జగన్ పరిస్థితి తారుమారైంది. ఇపుడు అతనికి రివర్స్ ఓదార్పు మొదలయ్యే సమయం వచ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ అభిప్రాయ పడుతున్నారు.

Post by Ram Gopal Varma.

Click it and Unblock the Notifications