»   » నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది: ఆర్జీవి నుండి మరో సంచలనం

నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది: ఆర్జీవి నుండి మరో సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెన్సార్ బోర్డ్ నిబంధనలు అడ్డు వస్తుండటంతో వెండితెరపై చూపించలేని తన క్రియేటివిటీని చూపించేందుకు రామ్ గోపాల్ వర్మ... యూట్యూబ్ లాంటి మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే వర్మ 'గన్స్ అండ్ థైస్' పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను మొదలు పెట్టారు. వీటితో పాటు షార్ట్ ఫిల్మ్స్ కూడా మొదలు పెట్టారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ తీసిన తొలి షార్ట్ ఫిల్మ్ 'మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్‌తి హై' అనే షార్ట్ ఫిల్మ్ ఈ రోజు రిలీజైంది. ఇండియా లాంటి దేశంలో తమ కూతురు సన్నీ లియోన్ మాదిరిగా పోర్న్ స్టార్ అవ్వాలని నిర్ణయించుకున్నపుడు సగటు ఇండియన్ పేరెంట్స్ ఎలా స్పందిస్తారు అనే విషయాన్ని తన షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు వర్మ.

సన్నీ లియోన్ కావాలనుకుంటున్న హీరోయిన్ తల్లిదండ్రులతో తన సెక్సువాలిటీ హక్కు గురించి వాదించే తీరును ఆసక్తికరంగా తెరకెక్కించారు వర్మ.

అది కూడా ఓ జాబ్

అది కూడా ఓ జాబ్

ఈ షార్ట్ ఫిల్మ్ లోని హీరోయిన్ వాళ్ల నాన్నతో ఇలా వాదిస్తుంది.... ‘మీరు అసిస్టెంట్ మేనేజర్‌గా గవర్నమెంటు ఆఫీసులో పని చేస్తున్నారు. అమ్మ హౌస్ వైఫ్, సిస్టర్ టీచర్, అంకుల్ డాక్టర్... మన పొరుగు వ్యక్తి పైలట్. అదే విధంగా సన్నీ లియోన్ పోర్న్ స్టార్. ఆమె పని కోట్లాది మందిని సంతోష పెట్టడం. మీకు ఇంకా నమ్మకం కలుగకుంటే ఇంటర్నెట్లో ఆమెకు వస్తున్న లైక్స్ చెక్ చేయండి.' అంటూ వాదిస్తుంది.

మీరే పాపులు

మీరే పాపులు

నీకేమైనా పిచ్చి పట్టిందా... పాపం చేయాలనుకుంటున్నావా? అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో.... ‘మీలా ఆలోచించే వారే పెద్ద పాపులు. కల్చర్, సొసైటీ, మోరాలిటీ పేరుతో ఆడపిల్లల్ని అణిచి వేస్తున్నారు. వారికి స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు. ఆడ పిల్లలుగా పుట్టడమే పాపం అనేలా పరిస్థితులు తయారు చేస్తున్నారు.' అని హీరోయిన్ వాదిస్తుంది.

సెక్స్ అప్పీల్ అమ్ముతుంది

సెక్స్ అప్పీల్ అమ్ముతుంది

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అమ్మూతూ జీవనం సాగిస్తుంటారు. కొందరు తమ రచనలను అమ్ముతారు, కొందరు తమ ఆర్ట్ అమ్ముతారు, కొందరు తమ హర్డ్ వర్క్ అమ్ముతారు. అదే విధంగా సన్నీ లియోన్ తన సెక్స్ అప్పీల్ అమ్ముతుంది. జీవిత సత్యం ఏమిటంటే... మనం ఏదైనా సంపాదించాలంటే ఏదో ఒకటి అమ్మాల్సి ఉంటుంది అంటూ హీరోయిన్ వాదిస్తుంది.

సంకుచిత మనస్తత్వాలు

సంకుచిత మనస్తత్వాలు

ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది. ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వాలి, అప్పుడే ఈ పిచ్చి తగ్గుతుంది.... అని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయగానే... తిరగబడిన హీరోయిన్ ‘ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాల్సింది నాకు కాదు. మీకే... అపుడే మీ సంకుచిత మనస్తత్వాలు ఓపెన్ అవుతాయి' అంటూ వాదిస్తుంది.

నా సెక్సువాలిటీ నా ఆస్తి

నా సెక్సువాలిటీ నా ఆస్తి

నా సెక్సువాలిటీ నా ఆస్తి, అదే నా శక్తి.... దాన్నే నేను పెట్టుబడిగా పెట్టి, కెరీర్ గా ఎంచుకుని ఎదగడానికి ఉపయోగిస్తాను. మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్దం కావు. సమస్య అంతా మీ సంకుచిత మనస్తత్వంలోనే ఉంది... అని హీరోయిన్ వాదిస్తుంది.

భర్త సొత్తు కాదు

భర్త సొత్తు కాదు

మీరు చిన్నప్పటి నుండి ఆడ పిల్లలను తప్పుడుగా ట్రైన్ చేస్తున్నారు. మీ సెక్సువాలిటీ మీ భర్త ప్రాపర్టీ అనే విధంగా పెంచుతున్నారు. అది తప్ప... నా శరీరం, నా సెక్సువాలిటీ, నా ప్రాపర్టీ.... దాన్ని నా కోసం, నా మంచి కోసం, నా ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటాను అని హీరోయిన్ వాదిస్తుంది.

వేశ్య అవ్వాలనుకుంటావా?

వేశ్య అవ్వాలనుకుంటావా?

నువ్వే వేశ్యగా మారాలనుకుంటున్నావా? అని తండ్రి మందలించడంతో.... మీలాంటి మగాళ్లే దానికి ఇలాంటి చీప్ పేర్లు పెడతారు అని హీరోయిన్ తిరగబడుతుంది.

పోర్న్ అంటే ఏమిటి? అదో ఫాంటసీ

పోర్న్ అంటే ఏమిటి? అదో ఫాంటసీ

ముందు మీరు పోర్న్ అనేది ఏమిటో అర్థం చేసుకోవాలి. పోర్న్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఫాంటసీ. యాక్షన్ ఫిల్మ్స్ లో విచిత్రమైన పవర్స్ చూపించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసినట్లే పోర్న్ ఫిల్మ్స్ లో వెరైటీ ఆఫ్ సెక్సువల్ ఎక్స్ పీరియన్స్ చూపించి ప్రేక్షకులను ఆనంద పరుస్తారు. ఇందులో తప్పేముంది? దీన్ని ఎంతో మంది ఇష్టపడుతున్నారు. కోట్ల మంది చూస్తున్నారు... అని హీరోయిన్ వాదిస్తుంది.

సెక్స్ సెలబ్రేట్ చేసుకోవాలి

సెక్స్ సెలబ్రేట్ చేసుకోవాలి

సెక్సువాలిటీ అనేది ఆ దేవుడు ఇచ్చిందే. దీన్ని తప్పుగా ఎందుకు చూస్తారు. సెక్స్‌ను మనం సెలబ్రేట్ చేసుకోవాలి... అని వాదించడంతో హీరోయిన్ తండ్రి బిత్తర పోతాడు. షార్ట్ ఫిల్మ్ పూర్తి గా చూసి మీ కామెంట్స్ ఏమిటో దీనిపై మీ కామెంట్ ఏమిటో తెలియజేయండి.

నటీనటులు

తెలుగు మూవీ వంగవీటిలో హీరోయిన్ గా నటించిన నైనా గంగూలీ ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా నటించింది. మకరంద్ దేశ్ పాండే, దివ్యా జగదలే తల్లిదండ్రులుగా నటించారు. రామ్ గోపాల్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు.

English summary
Meri Beti SUNNY LEONE Banna Chaahti Hai. A Short Film by RGV featuring Naina Ganguly, Makarand Deshpande and Divya Jagdale. Ram Gopal Varma makes his Short Film debut with #MeriBetiSUNNYLEONEBannaChaahtiHai
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu