twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ సీఎంకు బస్తిమే సవాల్... విజయవాడ నడిఒడ్డున ఆర్జీవీ ప్రెస్ మీట్

    |

    Recommended Video

    RGV's Basthi Me Sawaal To Chandrababu Naidu || Filmibeat Telugu

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో ఎన్నికల కారణంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. చేసేది లేక ఎన్నికలు ముగిసిన తర్వాత రిలీజ్ ప్లాన్ చేశారు. విజయవాడలో సినిమా ప్రెస్‌మీట్ పెట్టడానికి వర్మ ప్రయత్నాలు చేయగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో పాటు విజయవాడలోకి అడుగు పెట్టకుండా, ప్రెస్ మీట్ నిర్వహించకుండా అడ్డుకున్నారు.

    పోలీసులు వర్మను అడ్డుకోవడం, విజయవాడ నుంచి తరిమేయడం వెనక అప్పుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న చంద్రబాబు ఆదేశాలే కారణం అనే ఆరోపణలు వినిపించాయి. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడం, పదవి కోల్పోవడంతో... రామ్ గోపాల్ వర్మకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో పాటు వేయి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది.

    బస్తి మే సవాల్ !!!

    బస్తి మే సవాల్ !!!

    ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!! అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

    జై జగన్, ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఆహ్వానం

    జై జగన్, ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఆహ్వానం

    ‘‘విజయవాడలో ఆదివారం నేను నిర్వహించబోయే ప్రెస్‌మీట్ కోసం... ఎన్‌టి‌ఆర్ నిజమైన అభిమానులకి ఇదే నా బహిరంగ ఆహ్వానo..జై జగన్'' అంటూ వర్మ ఆహ్వానం పంపారు. ఈ ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే అవకాశం ఉంది.

    లైన్ క్లియర్

    లైన్ క్లియర్

    ఎన్నికల కారణంగా ఇంతకాలం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ హడావుడి ముగియడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ మూవీకి లైన్ క్లియర్ అయినట్లయింది. ఆదివారం ప్రెస్ మీట్లో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

    English summary
    Ram Gopal Varma's Lakshmis NTR press meet on May 26th at Vijayawada. Lakshmi's NTR is an Indian Telugu biographical drama film based on the life of former film actor and chief minister of undivided Andhra Pradesh, N. T. Rama Rao from the perspective of his second wife, Lakshmi Parvati as well as N. T. Rama Rao during his last days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X