వర్మ కొత్త చిత్రం 'అందం' ప్రకటన

ఇక ఆమె గురించి వర్మ చెపుతూ.. ''నేను అందాన్ని ఆరాధిస్తాను. ఆ విషయాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. నన్ను కట్టిపడేసిన అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వారిలో నథాలియాకే అగ్రతాంబూలం ఇస్తాను'' అన్నారు . అలాగే ''హింస, రక్తపాతాలకు 'రక్తచరిత్ర' ఉదాహరణగా చెబుతారు. అందాన్ని చూపించడంలో 'అందం' గురించి మాట్లాడుకొనేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతా. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను'' అన్నారు.
ఇక వర్మ దర్శకత్వం వహించిన చిత్రం 'డిపార్ట్‌మెంట్'. అమితాబ్‌బచ్చన్, రానా ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని డబ్ చేసి రానా మీద ఫోకస్ చేస్తూ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











