జేడే హత్యపై రామ్ గోపాల్ వర్మ సినిమా
వాస్తవ సంఘటనలను, హత్యోదంతాలను తెరకెక్కించి సొమ్ము చేసుకోవడంలో ఎక్స్ పర్ట్ గా పేరొందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో హత్యోదంతంపై కన్నేశారు. ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనం ప్రకారం..ఇటీవల ముంబైలో దారుణ హత్యకు గురైన రిపోర్టర్ 'జేడే' హత్య పై వర్మ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ లేడీ గుల్ పనాగ్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. గుల్ పనాగ్ ఇందులో క్రైమ్ జర్నలిస్టుగా నటించబోతోంది. ఈ విషయమై గుల్ పనాగ్ మాట్లాడుతూ...'ఈ సినిమాలో నా పాత్ర ఫోటో జర్నలిస్ట్ అనుజా గుప్తాను పోలి ఉంటుంది' అని తెలిపింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో డిపార్ట్ మెంట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రామ్ గోపాల్ వర్మ.... తెలుగు రామాయణం అనే సినిమా తీసే యోచనలో ఉన్నాడు. తను తీయబోది త్రేతాయుగం నాటి రామాయణం కాదని, ఇప్పటి ట్రెండ్ కు తగిన విధంగా సినిమా తీయబోతున్నాను అంటూ వెల్లడించిన వర్మ...ఇందులో హీరో నాగార్జునతో విలన్ రావన్ రాజు పాత్ర చేయిస్తున్నాను అంటూ సంచలనం సృష్టించారు. ఈ సినిమాలో నాగార్జున సరసన నయనతారను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే వర్మ పబ్లిసిటీ స్టంట్ కోసంమే రామాయణం సినిమా ప్రకటన చేశారని, నేను విలన్ పాత్రలో నటించడం ఏమిటని నాగార్జున గతంలో ఓ సందర్భంలో ప్రకటించారు. అయితే వర్మ మాత్రం తాను సినిమా తీయడం ఖాయం అంటున్నాడు. మరి ఏం జరుగబోతోందో త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











