వర్మ ‘పవర్‌స్టార్’లో హీరో ఎవరు? పవన్ కల్యాణ్ డూప్ ఏ జిల్లా వ్యక్తి? అసలు కథేంటి అంటే!
ఎప్పుడూ సెన్సేషనల్ వార్తలు, వివాదాలతో మీడియాలో, సోషల్ మీడియాలో ఉండే రాంగోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తున్నట్టు ప్రకటించి మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. అయితే పవర్ స్టార్ సినిమా ప్రకటనకు కాపు నేస్తం అనే దానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆ రెండు ప్రకటనలు రావడం యాదృచ్చికంగా మారింది అంటూ వర్మ ట్వీట్ చేశారు. అయితే పవర్ స్టార్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఫిల్మీబీట్ తెలుగు సేకరించింది. అవేమిటంటే..
Recommended Video

పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలని
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనే వర్మ గతంలో చాలా సార్లు ప్రయత్నించారు. అయితే వారిద్దరికి మధ్య పొంతన కుదరకపోవడం, వర్మకు మెగా క్యాంపుతో సరైన ఈక్వేషన్స్ లేకపోవడం వల్ల అది వర్మకు కలగానే మిగిలిపోయింది. గతంలో చిరంజీవితో సినిమా కూడా మధ్యలో ఆగిపోవడంతో వర్మతో సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదనేది ఓ వాదన.

ఆర్జీవీ థియేటర్ రిలీజెస్‌తో బిజీగా
అయితే ఇప్పుడు సినిమాల రూపొందించడంలో రాంగోపాల్ వర్మ తన అభిరుచిని మార్చుకొన్నారు. తన పరిధిలోనే సినిమాలో రూపొందించుకొంటూ సొంత థియేటర్లలో రిలీజ్ చేసుకొంటూ కాలం గడిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్‌పై సినిమా తీసేసి ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకొన్నాడు.

టిక్ టాక్‌లో జూనియర్ పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పోలిన ఓ వ్యక్తిని తన సినిమాకు హీరోగా ఎంపిక చేసుకొన్నాడు. అయితే ఆ యువకుడికి సంబంధించిన టిక్‌టాక్ వీడియోలను చూసి ఆ యువకుడిని పట్టుకొన్నారని, స్వయంగా కారు పంపించి వేరే ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రప్పించారని తెలిసింది. ఆ క్రమంలో తన ఆఫీస్‌కు వచ్చిన క్రమంలో చిన్న వీడియోను తీసి తన ట్విట్టర్‌లో పోస్టు చేయడం జరిగింది.

భద్రాచలంకు సమీపంలోని సారపాక
అయితే పవర్ స్టార్‌గా నటించబోయే యువకుడి పేరు నరేష్. అతడు భద్రాచలంకు సమీపంలోని సారపాక గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పోలిన రూపు రేఖలు ఉండంతో ఆయనను అనుకరిస్తూ టిక్‌టాక్‌లో వీడియోలు పెట్టారు. వాటిని చూసిన వర్మ తన సినిమాకు ఉపయోగించుకోవాలని అనుకొన్నారు.

నరేష్‌తో ప్రాజెక్ట్ డిటైల్స్ చర్చించి
ఇక హైదరాబాద్‌కు రప్పించిన నరేష్‌తో వర్మ కొద్ది సేపు భేటీ అయ్యారని, దాదాపు పది రోజులపాటు షూటింగ్ ఉంటుందని వివరించినట్టు చెప్పారు. అయితే పవర్ స్టార్‌పై రూపొందించబోయే సినిమా రెండు భాగాలుగా ఉంటాయని, ఒక భాగంలో వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తానని స్పష్టం చేశారు. అయితే పవర్ స్టార్ సినిమాలోని వివాదస్పద అంశాలపై తర్జనభర్జన పడిన తర్వాత ఆ చిత్రంలో నటించేందుకు సిద్దమైనట్టు సమాచారం.

స్క్రిప్టుపై సీక్రెట్‌గా
అయితే త్వరలోనే రాంగోపాల్ వర్మ తన పవర్ స్టార్ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే స్క్రిప్టుపై కొందరు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని తెలుస్తున్నది. అయితే ఎలాంటి అంశాలను తెరకెక్కిస్తన్నారనే విషయాలను గోప్యంగా ఉంచాలని యూనిట్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











