రాంగోపాల్ వర్మకు షాక్.. మూతపడ్డ ఆర్జీవి వరల్డ్ థియేటర్.. ఏం జరిగిందంటే?
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న పవర్‌స్టార్ సినిమా విషయంలో తెలుగు ఫిల్మీబీట్ రాసిన కథనం నిజమైంది. ఆర్జీవి సినిమా రిలీజ్, టికెట్ ధర, ట్రైలర్‌కు టికెట్ పెడుతున్నారని రాసిన కథనం అక్షరాల వాస్తవమైంది. అయితే శ్రేయాస్ మీడియా యాప్‌లో ఆర్జీవి థియేటర్ మూసేసి.. కొత్త దుకాణం తెరవడంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..

ఆర్జీవి కొత్త థియేటర్
జూన్ 18వ తేదీన ఆర్జీవి ట్వీట్ చేస్తూ.. నా ఆన్‌లైన్ థియేటర్ లోగోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. www.rgvworldtheatre లో ప్రవణ్ కల్యాణ్ నటించిన పవర్ స్టార్ సినిమాను రిలీజ్ చేస్తున్నాని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని జూలై 25వ తేదీన 11 గంటలకు రిలీజ్ చేస్తున్నా. ఆ తర్వాత అప్సర రాణి నటించిన థ్రిల్లర్ సినిమా రిలీజ్ అవుతుంది అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మూత పడిన ఆర్జీవివరల్డ్ థియేటర్
ఇక శ్రేయాస్ మీడియా యాప్‌లో తెరిచిన ఆర్జీవివరల్డ్ థియేటర్ దుకాణం ఊతపడింది. వర్మ, శ్రేయాస్ మీడియాకు మధ్య జరిగిన ఒప్పందం మధ్యలోనే క్యాన్సిల్ అయ్యిందనే వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఏం జరిగిందనే విషయం ఎవరికి అంతుపట్టని విధంగా మారింది. ఇరు వర్గాలు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ తన కొత్త థియేటర్‌ను ఇంటర్నెట్‌లో సొంతంగా నిర్మించుకోవడం విశేషం.

ట్రైలర్‌కు టికెట్
ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌కు 25 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించాం. ఈ ధర కేవలం ట్రైలర్ చూడటానికి మాత్రమే. ఫుల్ సినిమా చూడాలంటే దానికి సపరేట్‌గా టికెట్ ధర ఉంటుంది అని ఆర్జీవి తెలిపారు.

పవర్ స్టార్ సినిమా కథ ఏమిటంటే..
ఓ సినిమా నటుడు ఇష్టంగా పెట్టిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయిందనే కోణంలో పవర్ స్టార్ సినిమాను రూపొందించాం. ఆ క్రమంలో పవర్‌ఫుల్ స్టార్ ఏ విధంగా బలహీన పడ్డారు. ఆయన చేసిన తప్పులు ఎలా తెలుసుకొన్నారు? పార్టీలో శ్రేయోభిలాషులు, వెన్నపోటుదారుల గురించి చెప్పబోతున్నాం. ఆయన రష్యన్ భార్య, ఆయన ఇష్టపడే చెట్లు, దున్నపోతుల గురించి చూపించబోతున్నాం అంటూ ఆయన ట్వీట్‌లో తెలిపారు.
Recommended Video

అడ్వాన్స్ బుకింగ్‌కు 150.. కరెంట్ టికెట్ ధర 250
పవర్ స్టార్ ఫుల్ మూవీ జూలై 25వ తేదీ 11 గంటలకు రిలీజ్ చేస్తున్నాం. ఆర్జీవీవరల్డ్ థియేటర్.కామ్‌లో రిలీజ్ అయ్యే సినిమా టికెట్ అడ్వాన్సుగా తీసుకొంటే రూ.150 రూపాయలు. అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే జూలై 25న టికెట్ ధర రూ.250లుగా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 22వ తేదీన 11 గంటలకు రిలీజ్ చేస్తున్నాం అని వర్మ మరో ట్విట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











