ముందే లీక్ అయిన ‘పవర్ స్టార్’ ట్రైలర్... సస్సెన్స్‌గా మారిన అదృశ్య వ్యక్తి.!

By Manoj

విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. మాఫియా డాన్‌ల నుంచి రాజకీయ నాయకుల వరకు ఆయన ఎవరినీ వదలకుండా సినిమాలు చేశాడు. అందుకే దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక, కొన్నేళ్లుగా వరుసగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలనే తెరకెక్కిస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇప్పటికే 'రక్త చరిత్ర', 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి వివాదాస్పద చిత్రాలను రూపొందించిన వర్మ... ప్రస్తుతం 'పవర్ స్టార్' అనే మూవీతో వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లీక్ అయింది. అందులో ఏముందంటే..!

Recommended Video

Power Star Trailer ఫ్రీగా పవర్ స్టార్ | సినిమా కోసమే ట్రైలర్ లీక్ చేసాడా ? || Oneindia Telugu
పవన్ కల్యాణ్‌ను ప్రవన్ కల్యాణ్‌ చేశాడు

పవన్ కల్యాణ్‌ను ప్రవన్ కల్యాణ్‌ చేశాడు

కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడిపడి ఉన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘పవర్ స్టార్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగానే ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో హీరోను ప్రవన్ కల్యాణ్ అని పరిచయం చేశాడు వర్మ.

కల్పిత కథ అంటూనే కలకలం రేపేశాడు

కల్పిత కథ అంటూనే కలకలం రేపేశాడు


ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఇది పవన్ కల్యాణ్‌కు సంబంధించినది అని అందరూ గమనించారు. అయితే, వర్మ మాత్రం ఇది కల్పిత కథ అని చెబుతున్నాడు. తాను రాసుకున్న కథ ఎవరిని పోలీ ఉంటుందనేది తనకు తెలియదని అంటున్నాడు. కానీ, పవన్‌లా ఉన్న వ్యక్తినే హీరోగా పెట్టడంతో పాటు కొన్ని క్యారెక్టర్లు కూడా ఆయన సన్నిహితులవే క్రియేట్ చేశాడు.

‘గడ్డి తింటావా’తో సినిమా చూపించాడు

‘గడ్డి తింటావా’తో సినిమా చూపించాడు


వాస్తవానికి ఈ సినిమాలో ఆర్జీవీ... పవన్ కల్యాణ్‌ను మరీ దారుణంగా చూపించడని అందరూ భావించారు. కానీ, ఇటీవల విడుదలైన ‘గడ్డి తింటావా' అనే పాట దానికి భిన్నంగా ఉండడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఒక్క పాటతోనే సినిమా ఎలా ఉంటుందో వర్మ చూపించేశాడు. దీనికి మెగా ఫ్యాన్స్‌ నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అందుకే పాటకు డిజ్‌లైక్స్ వచ్చాయి.

టాలీవుడ్ చరిత్రలో తొలిసారి.. వర్మ రికార్డ్

టాలీవుడ్ చరిత్రలో తొలిసారి.. వర్మ రికార్డ్

పవన్ కల్యాణ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే రాంగోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే జూలై 22న 11 గంటలకు విడుదల చేయనున్న ట్రైలర్‌ను చూడ్డానికి రూ. 25 టికెట్ రేటు పెట్టాడు. తెలుగు సినిమా చరిత్రలో ఓ సినిమా ట్రైలర్‌ను అమ్మడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ముందే లీక్ అయిన ‘పవర్ స్టార్’ ట్రైలర్

ముందే లీక్ అయిన ‘పవర్ స్టార్’ ట్రైలర్

కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు బంద్ అయ్యాయి. దీన్ని అనుకూలంగా మలచుకున్న వర్మ... ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించాడు. దీని ద్వారానే తన సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇక, ఇందులో ‘పవర్ స్టార్' ట్రైలర్, 25న సినిమాను వదులుతున్నట్లు చెప్పాడు. కానీ, సమయానికి ముందే ట్రైలర్ బయటకు వచ్చేసింది.

పేద్ద ట్రైలర్.. అన్నీ చూపించిన ఆర్జీవీ

పేద్ద ట్రైలర్.. అన్నీ చూపించిన ఆర్జీవీ

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పవర్ స్టార్' ట్రైలర్‌.. రాంగోపాల్ వర్మ విడుదల చేయడానికి ముందే ఓ వెబ్‌సైట్‌కు సంబంధించిన యూట్యూబ్ చానెల్‌లో అది ప్రత్యక్షమైంది. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో వర్మ చాలా అంశాలు చూపించాడు. ఎలెక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి మొదలెట్టి ఆ తర్వాత జరిగిన చాలా విషయాలను అందులో జోడించాడు.

అందులో ఉన్న సీన్లు ఇవే.. సస్పెన్స్

అందులో ఉన్న సీన్లు ఇవే.. సస్పెన్స్

ఈ ట్రైలర్‌లో ప్రముఖ డైరెక్టర్ గెటప్‌లో ఉన్న వ్యక్తిని హీరో కొట్టడం... మెగాస్టార్ గెటప్‌లో ఉన్న వ్యక్తి హీరోను ప్రశ్నించడం... మాజీ ముఖ్యమంత్రిలా ఉన్న వ్యక్తిపై హీరో కోప్పడడం... తన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి హీరో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం... ఇలా ఇందులో ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇక చివర్లో ఓ అదృశ్య వ్యక్తి ఎంట్రీ ఇవ్వడం సస్సెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X