Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మా అమ్మానాన్నను బ్లేమ్ చేయకండి.. ఇది నా నిర్ణయం.. ట్విట్టర్లో వర్మ
వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. ఎప్పుడూ లాజికల్ ధోరణిలో పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకర్షించడమే కాకుండా ఆసక్తి రేపుతారు. సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ పెట్టారంటే అందులో ఏదో ఒక విశేషం ఖచ్చితంగా ఉంటుంది. నెగెటివ్, పాజిటివ్ ఏదైనా నాణెంపై బొమ్మా, బొరుసులా తీసుకుంటారు రామ్‌గోపాల్ వర్మ. కాగా తాజాగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన పోస్ట్ చేసిన ఓ ట్వీట్, దానిపై చేసిన ట్యాగ్ లైన్ వైరల్ అవుతోంది.
ట్విట్టర్ వేదికగా తన చిన్ననాటి ఫోటో షేర్ చేసిన వర్మ.. దానిపై ఓ వెరైటీ ట్యాగ్ లైన్ రాసి తన విలక్షణతను మరోసారి నెటిజన్ల ముందుంచారు. ఈ ఫొటోలో గుబురుగా ఉన్న జుట్టు, ఆ కాలం నాటి ప్యాంటు, పూల షర్ట్ ధరించి కనిపిస్తున్నారు వర్మ. ''పాఠశాల రోజుల్లో నేను ఇలా ఉన్నాను. ఇది చూసి మా అమ్మానాన్నను బ్లేమ్ చేయకండి.. ఆ దుస్తులు నేను కొనుకున్నవే'' అని ఈ ఫొటోను ఉద్దేశిస్తూ ఓ డిఫెరెంట్ కామెంట్ వదిలారు రామ్ గోపాల్ వర్మ. ఇందులో ఆయన లుక్కే ఓ ఆకర్షణ అయితే, చేసిన కామెంట్ మరో ఆకర్షణగా నిలుస్తోంది. సందర్భం ఏదైనా తనదైన కోణంలో లాజికల్‌గా మాట్లాడటంలో వర్మను మించిన మనిషి ఉండరని ఈ ఫొటో చూసిన వారంతా అంటున్నారు. వర్మ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
That’s me in school ..And before u blame my mom or dad the clothes were bought by me. pic.twitter.com/pilot6NU9v
— Ram Gopal Varma (@RGVzoomin) July 16, 2019
ఇక వర్మ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనాలు సృష్టించారు. సరిగ్గా ఎన్నికల వేళ వర్మ విడుదల చేసిన ఈ సినిమా టీడీపీపై ప్రతికూల ప్రభావం చూపిందనే టాక్ ఉంది. ఈ సినిమా సృష్టించిన హంగామాను కంటిన్యూ చేసేలా కొద్ది రోజుల క్రితమే మరో సినిమా చేయనున్నట్లుగా ప్రకటించారు వర్మ. 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనే పేరుతో రానున్న ఈ సినిమాకు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు రామ్‌గోపాల్ వర్మ.