ఇది వర్మ సినిమా ('రౌడీ' ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్: భిన్న ధ్రువాల్లాంటి మోహన్‌బాబు, రామ్‌గోపాల్ వర్మ కలిసి ఓ సినిమా చేస్తారనేది ఊహకు అందని విషయం. దాంతో వీరి కాంబినేషన్ లో 'రౌడీ' చిత్రం ప్రకటించినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. తర్వాత రిలీజైన ఫస్ట్ లుక్ సైతం అందరినీ ఆకట్టుకుంది. అయితే టీజర్ చూసినవారంతా రక్త చరిత్ర మేకింగ్ తరహాలో నడిచే సర్కార్ కి రీమేక్ అని తేల్చేసినా సినిమాపై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇలాంటి నేఫధ్యంలో విడుదల అవుతున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది ఈ రోజు తెలుస్తుంది.

ఖద్దరు కట్టిన ప్రతి ఒక్కడూ మహాత్ముడు కాడు. అలానే.. ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడూ రౌడీ కాదు. హింసకు కొన్నిసార్లు హింసతోనే సమాధానం చెప్పవలసి వచ్చిప్పుడు, మంచితనం చేతకానితనంగా మిగిలిపోతున్నప్పుడు ఆయుధం పట్టాల్సిందే. మరి.. 'రౌడీ'లో ఎవరు, ఎందుకు ఆయుధం పట్టారో తెలియాలంటే చిత్రం చూడాల్సిందే

వర్మ మేకింగ్ క్లాస్ ని ఆకర్షిస్తే... 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది... వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది' వంటి డైలాగులు మాస్ ని ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. పూర్తి సీరియస్ డ్రామాతో నడిచే ఈ చిత్రంలో మోహన్ బాబు అన్న పాత్రలో తనదైన శైలిలో డైలాగులు చెప్తూ అదరకొట్టనున్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజంలో జరిగే ఈ కథ ఓ మంచి రౌడీ కథగా తీర్చి దిద్దానని వర్మ చెప్తున్నారు. కథగా గాడ్ ఫాధర్ పోలికలు ఉంటాయని ఆయనే స్వయంగా చెప్తున్నారు. అలాగే ఇంటర్వెల్ కు ముందు 11 నిముషాల పాటు యాక్షన్ ఎపిసోడ్ వస్తుందని, అది సినిమాకు హైలెట్ అని అంటున్నారు.

Ram Gopal varma's Rowdy preview

మంచు విష్ణు మాట్లాడుతూ... ఒకటీ, ఒకటీ కలిస్తే ఒకటే! ఇదీ రాయలసీమ లెక్క. ఇక్కడ ఇద్దరు శత్రువులు కలిస్తే ఒక్కరే మిగులుతారు. ఇద్దరు మిత్రులు కలిస్తే.. ఒక్కటైపోతారు. రాయలసీమలో ఉండే 'అన్న' సిద్ధాంతం ఇదే. ఇంతకీ ఆయనేం చేశాడో..? అన్నగా ఏం సాధించాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. ... రామ్‌గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. ఈ చిత్రంలో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్ళాం అన్నారు.

బ్యానర్: 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ, ఎవి పిక్చర్స్
నటీనటులు:మోహన్ బాబు, మంచు విష్ణు, శాన్వి, జయసుధ, తణికెళ్ళ భరణి తదితరులు.
సంగీతం: సాయికార్తీక్,
మాటలు: గంగోత్రి విశ్వనాథ్,
కెమెరా: సతీష్ ముత్యాల,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X