సినీ, రాజకీయ వర్గాలకు షాకిస్తూ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన.. హాట్ టాపిక్

Recommended Video

RGV's Tweet Goes Viral || గోపాల్ దాస్ వర్మచంద్ రాంధి' అంటూ..!!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏ విషయంలో నైనా మనసుకు ఏదనిపిస్తే ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తాజాగా అదే రిపీట్ చేశాడు. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ డైరెక్టర్ ఈ సారి ఏకంగా మహాత్మ గాంధీని అడ్డం పెట్టుకొని రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. వివరాల్లోకి పోతే..

అందరూ ఆ పనిలో ఉంటే.. ఈయన మాత్రం

అందరూ ఆ పనిలో ఉంటే.. ఈయన మాత్రం

గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఆ మహాత్ముడిని తలచుకుంటుంటే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం సంచలన కామెంట్లతో అందరి చూపు తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. గాంధీ ముఖ చిత్రంలో తన ఫోటోను పెట్టి ఎడిట్ చేసిన పిక్ షేర్ చేస్తూ 'హ్యాపీ మై జయంతి' అని ట్వీట్ చేశాడు వర్మ. దీంతో ఈ ట్వీట్ కాస్త సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గాంధీని పోలే విధంగా.. ఊహించని షాక్

గాంధీని పోలే విధంగా.. ఊహించని షాక్

అంతటితో ఆగక తన పేరును కూడా మార్చుకొని మరో సెన్సేషనల్ ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. గాంధీజీ పూర్తి పేరైన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీని పోలే విధంగా.. గోపాల్ దాస్ వర్మ చంద్ రాందీగా తన పేరును పేర్కొంటూ సంచలనానికి తెరలేపాడు. పైగా ఎవ్వరికీ తెలియని ఓ విషయం అంటూ సందేశమిచ్చి షాక్ ఇచ్చాడు.

స్త్రీ బానిసత్వం పోగొట్టడానికి కృషి

స్త్రీ బానిసత్వం పోగొట్టడానికి కృషి

''బ్రిటిష్ పాలనలో భారతీయుల బానిసత్వం పోవడానికి పోరాడి, భారతీయ పాలన రాబట్టి స్వాతంత్య్రం తెచ్చిపెట్టారు అలనాటి గాంధీ. అయితే వారికి కూడా తెలియని విషయం ఏమిటంటే స్త్రీ బానిసత్వం పోగొట్టడానికి, వారి విలువల కోసం పోరాడుతున్నది రామ్ వర్మ మాత్రమే'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ.

హోరెత్తుతున్న కామెంట్లు

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ పై కామెంట్లు హోరెత్తుతున్నాయి. కేవలం ప్రచారం కోసమే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని అంటూ కొందరు అతనిపై ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు మాత్రం వర్మ ఆలోచనలే వేరు.. ఆ స్టయిలే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

ఇక రామ్ గోపాల్ వర్మ సినిమా విషయాలకొస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. కులాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, అయితే అది ఏ మాత్రం వివాదస్పదం కాదని ప్రకటించాడు వర్మ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X