For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రబాబుపై వర్మ సంచలన కామెంట్స్.. మామూలు పోలిక కాదండీ బాబు! టీడీపీ ఫ్యాన్స్ ఫైర్

|

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను కొన్ని రోజుల పాటు ఆపడం చంద్రబాబు నాయుడికి ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. పోయి పోయి తన జోలికే వస్తే ఎలా ఉంటుందనేది వర్మ ప్రత్యక్షంగా చూపెడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ట్వీట్ చేస్తూ చంద్రబాబు వెన్నువిరిచే పని పట్టుకున్నారు వర్మ. ఎన్నికల్లో ఘోర పరాభవం పరాభవం పొంది తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ వర్గాలకు వర్మ పెడుతున్న ట్వీట్స్ కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబును ఉద్దేశిస్తూ వర్మ చేసిన ట్వీట్ సెన్సేషన్ అవుతోంది.

కృష్ణానది వరద.. ప్రమాదంలో కొన్ని ఇల్లు

కృష్ణానది వరద.. ప్రమాదంలో కొన్ని ఇల్లు

కృష్ణానది లోకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో.. కరకట్టపై ఉన్న పలు ఇళ్లలోకి నీరు చేరడం, ఆ ఇల్లు ప్రమాదం అంచున నిలవడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం అంచున ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటికి కూడా వరద ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు ఇంటి పరిసర ప్రాంతాలపై వరద తీవ్రతను అంచనా వేసేందుకు డ్రోన్లు వదిలారు ఇరిగేషన్ శాఖా అధికారులు. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం కుట్ర పూర్వకంగానే చంద్రబాబు ఇంటిమీదకు వరద వదిలిందని ఆరోపిస్తున్నారు.

ఎంటరైన వర్మ.. మామూలు పోలిక కాదండీ బాబు!

ఇంతలో సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యాడు. ఇంటిపై డ్రోన్స్ ఎగిరితే చంద్రబాబుకు భయమెందుకు?. ఆయనేమైనా ఒసామా బిన్ లాడెన్ లాంటివాడా ? లేదా ఆయన ఇంటి పెరట్లో ఏమైనా దాచిపెట్టాడా ? అని ప్రశ్నించారు వర్మ. జస్ట్ ఆస్కింగ్.. ఊరికే అడుగుతున్నా అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక వదిలే పరిస్థితి కనిపించడం లేదు

ఇక వదిలే పరిస్థితి కనిపించడం లేదు

గతంలో టీడీపీ నడ్డి విరిచేలా పలు సంచలన కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ అంత త్వరగా చంద్రబాబును వదిలే పరిస్థితి కనిపించడం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే వర్మ కామెంట్స్ మున్ముందు టీడీపీ వర్గాలను మరింత కుంగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

ఇక రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయాలకొస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. కులాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, అయితే అది ఏ మాత్రం వివాదస్పదం కాదని ప్రకటించాడు వర్మ. ఆగస్టు 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా లోని సాంగ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే.

English summary
In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got presigious win. Ram Gopal Varma once again attacked chandrababu with his tweets..
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more