»   » టీచర్స్‌ డే గురించి రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్

టీచర్స్‌ డే గురించి రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Gopal Verma
హైదరాబాద్: సినిమా రంగంలో అందరిదీ ఓ దారైతే ఆయనది మరో దారి, ఎడ్డం అంటే తెడ్డం అనే రకం. వివాదాలతో సావాసం చేయడం, నా ఇష్టం చెత్త సినిమాలే తీస్తా....చూస్తే చూడండి లేకుంటే మానండి అని తెగేసి చెప్పడం ఆయన స్టైల్. పబ్లిసిటీ కోసమే ఇలా వంకర వేషాలు వేసే వ్యక్తి మరెవరో కాదు.....దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

వర్మ తన వంకర నైజాన్ని మరోసారి బయట పెట్టారు. తాజాగా టీచర్లను టార్గెట్ చేసారు. టీచర్స్ డేను పురస్కరించుకుని సోషల్ నెట్వర్కింగ్ సైట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. గురువుకు సమాజం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటే...వర్మ మాత్రం అదో సక్సెస్ లేని వేస్ట్ కెరీర్ అని వ్యాఖ్యానించారు.

'హ్యాపీ టీచర్స్ డే అని నేను అస్సలు చెప్పును. ఎందుకంటే నేనెప్పుడూ ఒక్క రోజు కూడా మా టీచర్లతో సంతోషంగా గడిపింది లేదు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులను సక్సెస్‌ఫుల్ కెరీర్ వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నట్లయితే.....మరి ఉపాధ్యాయులు సక్సెస్‌లేని ఆవృత్తిని ఎందుకు ఎంచుకున్నారు. సక్సెస్‌ఫుల్ డాక్టర్లు, సక్సెస్‌ఫుల్ ఇంజనీర్లు...ఇలా చాలా రంగాల్లో సక్సెస్‌లు విన్నాను. కానీ సక్సెస్‌ఫుల్ టీచర్ అనే పేరు మాత్రం నేనెప్పుడూ వినలేదు' అని వర్మ ట్వీట్ చేసారు.

'కరణ్ జోహార్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్' మాదిరి ఎవరైనా 'టీచర్స్ ఆఫ్ ది ఈయర్' సినిమా తీస్తే ఆ సినిమా డిజాస్టర్ ఆఫ్ ది ఈయర్‌గా నిలుస్తుంది. తక్కువ జీతాలతో పని చేస్తున్న టీచర్లను సంతోషంగా ఉంచడానికే విద్యార్థులు ఇలాంటి టీచర్స్ డేలు నిర్వహిస్తారు' అంటూ వర్మ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

ఇంతటితో ఆగకుండా క్లాస్ రూములో తన చిన్ననాటి అనుభవాలను కూడా వెల్లడించారు వర్మ. అతడు ఎప్పుడూ తన ఉపాధ్యాయులు చెప్పేవి వినేవాడు కాదట. లాస్ట్ బేంచీలో కూర్చుని కామిక్స్, నవలలు చదువుకుంటూ కూర్చునే వాడట. మరి వర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి.

English summary
It's Teachers Day today and as usual, several Bollywood celebrities took to the social networking sites to express their respective childhood experiences with their teachers and professors. But, renowned filmmaker Ram Gopal Varma has gone the other way this time and has dropped a bomb on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu