»   » ఆశ్చర్యం: ‘బాహుబలి’ ట్రైలర్‌కు రామ్ గోపాల్ వర్మ 500/100

ఆశ్చర్యం: ‘బాహుబలి’ ట్రైలర్‌కు రామ్ గోపాల్ వర్మ 500/100

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. ఆయన ట్విట్టర్ ద్వారా చేసే మిడ్ నైట్ చేసే ట్వీట్స్ ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన రాత్రి బాగా తాగి వివాదాస్పద ట్వీట్స్ చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ రాజమౌళి ‘బాహుబలి' సినిమాపై ట్వీట్స్ చేసారు.

చాలా సందర్భాల్లో ఇతర సినిమాలపై విమర్శలు గుప్పించే రామ్ గోపాల్ వర్మ...ఈ సారి ఆశ్చర్యంగా అలా కాకుండా పాజిటివ్ గా ట్వీట్స్ చేసారు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ఎలాంటి ట్వీట్స్ చేసారు అనేది స్లైడ్ షోలో చూద్దాం.


బాహుబలి సినిమా ట్రైలర్ విషయానికొస్తే.... 2 నిమిషాల నిడివిగల బాహుబలి ట్రైలర్ సోమవారం రిలీజ్ చేసారు. ఉదయం థియేటర్లలో ట్రైలర్ విడుదల కాగా, సాయంత్రం 5 గంటలకు ఇంటర్నెట్లో విడుదల చేసారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ ట్రైలర్ కూడా విడుదల చేసారు. హిందీ ట్రైలర్ రిలీజ్ కోసం ముంబైలో ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసారు. హిందీలో కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో పబ్లిసిటీ భారీగా చేస్తున్నారు కరణ్ జోహార్. అందులో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలను ముంబై పిలిపించి భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.


రాజమౌళికి థాంక్స్

రాజమౌళికి థాంక్స్

ఇంటర్నేషనల్ స్కేలు ప్రకారం బాహుబలికి 100 కు 70 మార్కులు వేసిన వర్మ...ఇండియన్ స్కేలు ప్రకారం 100కు 500 మార్కులు వేసారు. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెలుతున్నందుకు థాంక్స్ కూడా చెప్పారు.


తాజ్ మహల్ తో

తాజ్ మహల్ తో

బాహుబలి సినిమాకు ఎంత ఖర్చయింది? పెట్టుబడి తిరిగొస్తుందా? లేదా? అనేది పాయింటు కాదు. ఇండియన్ సినిమాకు ఇది తాజ్ మహల్ లాంటిది. దశబ్దాల పాటు నిలిచిపోయే సినిమా.


ఎపిక్ మూవీ

ఎపిక్ మూవీ

ఎపిక్ సినిమాల్లో బాహుబలి న్యూ చాప్టర్ లాంటిది.


ప్రశంసలు

ప్రశంసలు

బాహుబలి సినిమాపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు గుప్పించారు.


రాజమౌళికి థాంక్స్

రాజమౌళికి థాంక్స్

ఇంత గొప్ప సినిమాతీస్తున్నందుకు రాజమౌళికి థాంక్స్ చెప్పారు వర్మ
English summary
More than for his path breaking films, Ram Gopal Varma is better known for his midnight tweets, of late. The latest to taste those so called drunk tweets is none other than Rajamouli's Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu