మెగా ఫ్యామిలీ పేరుతో ఫూల్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. బిగ్ సెటైర్ వేసేశాడుగా!
వివాదాస్పద వీరుడిగా వెలుగొందుతున్న రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర లేపుతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా అప్‌డేట్స్‌తో సినీ, రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్న ఆయన.. ఈ రోజు (అక్టోబర్ 29) మెగా ఫ్యామిలీ పేరుతో సినిమా రూపొందిస్తున్నట్లుగా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు వర్మపై పడింది.

9 గంటల 30 నిమిషాలకు అన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ వర్గాలు షాకయ్యాయి. పైగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు (అక్టోబర్) 9 గంటల 30 నిమిషాలకు వెల్లడిస్తానని చెప్పడంతో ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతలో వర్మ ఊహించని ట్విస్ట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

చివరి నిమిషంలో వర్మ సెన్సేషన్
9 గంటల 30 నిమిషాలకు వర్మ ఏ ప్రకటన చేస్తాడా? అని ఆతృతగా చూసిన జనాన్ని చివరకు ఫూల్స్ చేసేశాడు. ఆ ప్రాజెక్ట్‌ను తాను చేయాలనుకోవడం లేదని ట్వీట్ చేస్తూ షాకిచ్చాడు వర్మ. అంతేకాదు మెగా ఫ్యామిలీపై బిగ్ సెటైర్ కూడా వేసేశాడు.
అంత మందితో నా వల్ల కాదు.. అందుకే!
మెగాఫ్యామిలీ సినిమాలో ప్రధానమైన వ్యక్తికి 39 మంది పిల్లలు ఉన్నారని చెబుతూ.. అంత మంది పిల్లలు ఉండటం, పిల్లల సినిమాలు తీయడంలో తనకు అనుభవం లేకపోవడం కారణంగా `మెగాఫ్యామిలీ` సినిమాను రూపొందించడం లేదని సంచలన ప్రకటన చేశాడు రామ్‌గోపాల్ వర్మ.

పోలీస్ కేసు దాకా వెళ్లిన వ్యవహారం
రెండు రోజుల క్రితమే తన తాజా సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ విడుదల చేసి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు వర్మ. యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్ పలు వివాదాలకు ఊతమిచ్చింది. ఈ ట్రైలర్, 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ విషయమై వర్మపై పోలీస్ కేసు కూడా నమోదైంది.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లో పవన్ కళ్యాణ్
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ స్పెషల్‌గా డిజైన్ చేశారు వర్మ. అచ్చం పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న వ్యక్తిని జనసేనాని రోల్‌లో చూపిస్తూ ఆసక్తికర సన్నివేశాలు షూట్ చేశారని ఇటీవలే విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











