మెగా దెబ్బకు దుకాణం బంద్: మళ్లీ ఇపుడు పవర్ స్టార్ స్పూర్తి‌తో రీ ఓపెన్!

By Bojja Kumar

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్విట్టర్ వేదికగా అనేక వివాదాలకు తెరలేపారు. వారు వీరు, అదీ ఇది అని తేడా లేకుండా.... తనకు నచ్చని ప్రతి అంశంపై, ప్రతి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేసేవాడు. అలా అనేక మంది ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే గత 7 నెలలుగా వర్మ ట్విట్టర్ ఖాతా మూగబోయింది. మే 27, 2017న చివరి ట్వీట్ చేసిన వర్మ తర్వాత దాన్ని మూసివేశారు.

Recommended Video

నేను గే కాదు.... కానీ పవన్ కళ్యాణ్‌‌నే నా ఆప్షన్ !

ట్విట్టర్ అజ్ఞాతవాసం వీడిన వర్మ

నూతన సంవత్సరం ప్రారంభం అయిన వేళ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ అజ్ఞాతవాసం వీడారు. జనవరి 2న ట్విట్టర్లో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ఖాతా రీ ఓపెన్ చేశారు.

అజ్ఞాతవాసితో స్పూర్తి పొందాను

మళ్లీ ట్వీటర్ ఖాతా రీఓపెన్ చేసిన వర్మ స్పందిస్తూ.... పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'తో స్పూర్తిని పొంది మళ్లీ ట్విట్టర్లోకి వచ్చానని తెలిపారు.

రజనీకాంత్ ప్రస్తావన

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కూడా వర్మ ట్వీట్ చేశారు. రాజకీయ ప్రవేశాన్ని ప్రకటిస్తున్న వేళ రజనీలో కనిపించిన పవర్ ను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని అన్నారు. తమిళనాడులో ప్రతి ఒక్కరూ రజనీకే ఓటు వేస్తారని చెప్పారు. అతనికి పోటీగా నిలబడటం ఏ రాజకీయ పార్టీకైనా కష్టమేనని అన్నారు.

ఓడ్కా మానేశాడు

రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన ట్వీట్స్ అన్నీ ఓడ్కా తాగిన మత్తులో చేస్తారనే విమర్శ ఉంది. అయితే తాను ఇప్పుడు వోడ్కా మానేశానని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నానని వర్మ తెలిపారు.

 అప్పట్లో అక్కు పక్షి వివాదం వైరల్

అప్పట్లో అక్కు పక్షి వివాదం వైరల్

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతా మూసి వేయడానికి మెగా వివాదమే అనే వాదన ఉంది. ఆ రోజుల్లో ఆయన మెగాస్టార్ మీద, పవన్ కళ్యాణ్ మీద, నాగబాబు మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీంతో వర్మను నాగబాబు ‘అక్కు పక్షి' అంటూ సంబోధిస్తూ మండి పడ్డారు. ‘అక్కు పక్షి' అనే పదాన్ని మెగా అభిమానులు ట్విట్టర్లో వైరల్ చేశారు. ఆ తర్వాత వివాదం మరింత ముదరడం వల్లనే వర్మ అప్పుడు ట్విట్టర్ ఖాతా మూశారని అంటుంటారు.

 పవన్ కళ్యాణ్ స్పూర్తితో

పవన్ కళ్యాణ్ స్పూర్తితో

మళ్లీ ఇపుడు పవన్ కళ్యాణ్ మూవీ స్పూర్తితో తాను ట్విట్టర్ ఖాతా తెరుస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం చర్చనీయాంశం అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X