twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్‌కు షాకిచ్చిన వర్మ.. పద్ధతి మార్చుకో.. బిగ్ బీ సీరియస్!

    ముంబై మహానగరంలో మాఫియాడాన్లు దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో చేసిన ఘోరాలు, అకృత్యాలను వెబ్ సిరీస్‌ ‘గన్స్ అండ్ థైస్’ రూపంలో తెరకెక్కించడానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ చే

    By Rajababu
    |

    ముంబై మహానగరంలో మాఫియాడాన్లు దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ నేర సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో చేసిన ఘోరాలు, అకృత్యాలను వెబ్ సిరీస్‌ 'గన్స్ అండ్ థైస్' రూపంలో తెరకెక్కించడానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ చేస్తున్న ప్రయత్నాలపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    Ram Gopal Varma's web series Guns & Thighs shocks Amitabh Bachchan!

    మితిమీరిన హింస, నేరాలు ఘోరాలతో కూడిన వెబ్ సిరీస్ ఆలోచనలు మానుకోవాలని బిగ్ బీ తీవ్రంగా మందలించారు. గన్స్ అండ్ థైస్ వెబ్ సిరీస్‌ను చూసిన బిగ్ బీ షాక్ గురయ్యారనేది తాజా సమాచారం.

    ఆలోచన మానుకో..

    ఆలోచన మానుకో..

    రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ ఇటీవల సర్కార్3 చిత్రంలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. ఈ క్రమంలో 9 నిమిషాల నిడివి ఉన్న వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను అమితాబ్ బచ్చన్‌కు రాంగోపాల్ వర్మ చూపించాడట. ఆ ట్రైలర్‌ను చూసిన బిగ్ బీ వెంటనే షాక్‌కు గురయ్యాడట. వెంటనే స్పందించి ఆ రక్త చరిత్రను తెరకెక్కించే ఆలోచనను మానుకోవాలని వర్మకు బిగ్ బీ సూచించినట్టు తెలిసింది.

    నిడివి తగ్గించి..

    నిడివి తగ్గించి..

    బిగ్ బీ సూచనలను, సలహాలను పెడచెవిన పెట్టిన వర్మ నిడివిని ఆరు నిమిషాలకు తగ్గించి ఆ ట్రైలర్‌ను జనాల మీదకి వదిలేశాడు. వెబ్ సిరీస్ ట్రైలర్‌ను చూస్తే అనామకులైన నటులతో ముంబై మాఫియా మధ్య జరిగిన రక్తపాతాన్ని చిత్రీకరించాడు. అత్యంత పాశవికంగా ఓ చిన్నారి ముఖంపై రక్తం వెదజల్లి హింసను తాను ఏ రేంజ్‌‌లో చిత్రీకరించదలచుకొన్నాడో చూపించాడు. ఊహించినంత విధంగా స్పందన రాకపోగా, గన్స్ అండ్ థైస్‌పై విమర్శలే ఎక్కువగా చెలరేగాయి.

    జుగప్సగా.. అతి దారుణంగా..

    జుగప్సగా.. అతి దారుణంగా..

    భారత్‌లో ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న వెబ్ సిరీస్ సంస్కృతి నేపథ్యంలో రాము తొలిసారి గన్స్ అండ్ థైస్‌తో ప్రయోగం చేపట్టాడు. బెడ్రూంలో పోలీసుతో ఓ మహిళ నగ్నంగా పడుకునే సీన్ చిత్రీకరించి తాన వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పాడు. సెన్సార్ పరిమితి లేని ఇంటర్నెట్ మాధ్యమంలో ఇలా నీచంగా సినిమాలు తీసి సమాజానికి ఏం చెప్పదలచుకొన్నారనే ప్రశ్నను విమర్శకులు లేవనెత్తుతున్నారు.

    కనుబొమ్మలు ముడిపడేలా..

    కనుబొమ్మలు ముడిపడేలా..

    వెబ్ సిరీస్‌ల నిర్మాణం తీరుతో రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరి కనుబొమ్మలు ముడిపడేలా చేశాడు. రాము వ్యవహారం, వెబ్ సిరీస్‌ల వ్యవహారంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ తీవ్రంగా స్పందించారు. బాధ్యతారహితంగా వెబ్ సిరీస్‌ను నిర్మించడం తగదు. ఇంటర్నెట్‌లో సెన్సార్ షిప్ లేనందున ఇలాంటి చర్యలు సమర్ధనీయం కాదు. నేను.. నా ఇష్టం.. అనే పద్దతిలో వెబ్ సిరీస్ చూపిస్తానని అనుకోవడం తప్పు. ప్రతీ సినీ దర్శకుడు స్వయంగా తనకు తాను సెన్సార్ షిప్‌ను విధించుకోవాలి అని నిహ్లానీ సూచించారు.

    English summary
    It is learnt that when Ram Gopal Varma showed the nine-minute trailer of his proposed new web series Guns & Thighs to Amitabh Bachchan, he was shocked. He advised Ramu to scrap the idea of this fiercely sanguine bloodbath taking us back to the time when Dawood Ibrahim and Chota Rajan ruled Mumbai. But RGV is going ahead with the series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X