»   »  రామ్ గోపాల్ వర్మ శృంగారాత్మక గీతం

రామ్ గోపాల్ వర్మ శృంగారాత్మక గీతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సచిన్ జోషి కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మొగలిపువ్వు'. మీరా చోప్రా, కైనత్ అరోరా కథానాయికలు. జెడ్3 పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీత్ గంగూలీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంది సీజర్ గొంజాలేస్ కోరియోగ్రఫీలో సచిన్ జోషి, మీరా చోప్రాలపై ఇటివలే ఓ శృంగారాత్మక గీతాన్ని తెరకెక్కించారు. వర్మ మార్క్ రొమాంటిక్ టచ్ ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణ.

Ram gopal varma-Sachin Joshi mogalipuvvu shoot in Poland

ఓ సినిమా చిత్రీకరణ కోసం పదిహేనేళ్ళ తర్వాత వర్మ విదేశాలకు వెళ్ళడం విశేషం. చివరిసారిగా 2000లో 'మస్త్' చిత్రంలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్ళారు. ఆ తర్వాత 'మొగలిపువ్వు' వర్మను విదేశాలకు తీసుకెళ్ళింది.

Ram gopal varma-Sachin Joshi mogalipuvvu shoot in Poland

వివాహిత వ్యక్తి ఓ మహిళతో పెట్టుకున్న సంబంధం ఎంత దూరం వెళ్ళింది. అక్రమ సంబంధాలు, వాటిలో సెల్ ఫోన్ పాత్ర ఎంతుంది అనే పాయింట్ మీద వర్మ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. 'ప్రతి పెళ్ళైన మగాడి సెల్ ఫోనులో భార్యకు తెలియని సీక్రెట్ ఉంటుంది' అంటూ సెల్ ఫోనును విలన్ చేసేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
Ram gopal varma-Sachin Joshi mogalipuvvu shoot in Poland
English summary
Sensational Director Ram Gopal Varma is very busy with various projects .His latest flm is 'Mogali Puvvu' Starring SachinJoshi ,Meera Chopra and Kainaat Arora which is an edge-of-the psychological and Romantic thriller .After Masth film in 2000, Rgvwent for foreign countries to shoot a song .
Please Wait while comments are loading...