పెద్ద డైరెక్టర్ పిల్లల సినిమా తీస్తే.. కుర్ర డైరెక్టర్ అడల్ట్ మూవీతో.. 2.0, శంకర్‌పై వర్మ సెటైర్

Recommended Video

Bhairava Geetha Pre Release Event : Ram Gopal Varma Speech | Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలోనే భారీ బడ్టెట్‌తో రూపొందిన 2.0 చిత్రం నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. సాధారణంగా క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుంటే చిన్న సినిమాల విడుదల వాయిదా పడుతాయి. కానీ 2.0 సినిమాకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సవాల్ విసురుతున్నారు. కుర్ర దర్శకుడు సిద్ధార్థ్ రూపొందించిన భైరవగీత చిత్రాన్ని నవంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వర్మ 2.0పై సెటైర్లు విసిరారు. ఇంతకీ వర్మ ఏం అన్నారంటే..

600 కోట్లతో శంకర్ 2.0

600 కోట్లతో శంకర్ 2.0

సూపర్‌స్టార్ రజనీకాంత్‌, అక్షయ్ కుమార్‌ కాంబినేషన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ 2.0 చిత్రాన్ని రూ.600 కోట్లతో తెరకెక్కించారు. ప్రపంచంలోనే మునుపెన్నడూ లేని విధంగా నేటివ్ త్రీడీ టెక్నాలజీతో 2.0 తెరకెక్కించారు. సాధారణంగా 2డీలో తీసి 3డీలోకి కన్వర్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాను ఆన్ లోకేషన్‌లోనే 3డీలో షూట్ చేయడం ప్రపంచంలోనే తొలిసారి.

పక్కా మాస్ సినిమాగా భైరవగీత

పక్కా మాస్ సినిమాగా భైరవగీత

ఇక భైరవగీత చిత్రాన్ని రాంగోపాల్ వర్మ శిష్యుడు సిద్ధార్థ్ తోతులు రూపొందించాడు. పక్కా గ్రామీణ వాతావరణంతో నేటివ్ సినిమాగా తెరకెక్కించారు. గ్రామాల్లో ఉండే పగ, ప్రతీకారం, పేదింటి కుర్రాడు.. గొప్పింటి కూతురు మధ్య ప్రేమను జొప్పించి సినిమాను రూపొందించట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రంలోని సన్నివేశాలు అత్యంత శృంగారభరితంగా కనిపిస్తున్నాయి. హాట్‌హాట్‌గా ముద్దులతో తెరపైన ఘాటుగా మారాయి. దాదాపు పెద్దలకు మాత్రమే సినిమాగా కనిపిస్తున్నది.

 రోబో పనై ఉంటుందేమో

రోబో పనై ఉంటుందేమో

భైరవ గీత సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయగా.. సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ ప్లే కాలేదు. అప్పుడు రాంగోపాల వర్మ మాట్లాడుతూ.. టెక్నాలజీ ఉపయోగిస్తూ రోబో చేస్తున్న పనై ఉంటుందేమో. అందుకే ట్రైలర్ ప్లే కావడం లేదు అంటూ వర్మ అనుమానం వ్యక్తం చేశారు.

పెద్ద డైరెక్టర్.. చిన్న డైరెక్టర్ అంటూ

పెద్ద డైరెక్టర్.. చిన్న డైరెక్టర్ అంటూ

అంతేకాకుండా సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరున్న శంకర్ గ్రాఫిక్స్‌తో 2.0 సినిమాను చిన్న పిల్లల చిత్రంగా తీశాడు. అదే కుర్రాడైన సిద్ధార్థ్ ఇంటెన్సిటీ కథతో పెద్దలకు మాత్రమే సినిమా తీశాడు. నేనైతే సిద్ధార్థ్ సినిమానే చూస్తాను. ఆ తర్వాతనే రోబో2.0 గురించి ఆలోచిస్తాను అని వర్మ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X