For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV అసెంబ్లీలు కూడా సర్కస్ కంపెనీలే.. వాళ్లు కూడా జోకర్లే.. వైఎస్ జగన్‌ అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు

  |

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)కు జరిగిన ఎన్నికల్లో చోటు చేసుకొన్న సంఘటనలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. తెలుగు సినిమా రంగం పెద్ద సర్కస్‌లా అనిపించింది. చాలా మంది జోకర్లుగా కనిపించారు అంటూ తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమర్ధించుకొన్నారు. కేవలం సినిమా రంగమే కాదు.. అసెంబ్లీలు కూడా సర్సస్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఆ సమావేశాలను కూడా ఎవరూ చూడటం లేదు అంటూ వర్మ మాట్లాడుతూ..

  శ్రీరెడ్డి వివాదం తర్వాతే

  శ్రీరెడ్డి వివాదం తర్వాతే

  వాస్తవానికి నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏం చేస్తుందో తెలియదు. శ్రీరెడ్డి వివాదం తర్వాత నాకు మా సంస్థ గురించి తెలిసింది. అయితే మా కోసం భవనం కట్టాల్సిన అవసరం లేదనిది నా అభిప్రాయం. ఆర్టిస్టులకు భవనం ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఏదైనా సమస్య వస్తే ఆన్‌లైన్‌లో పరిష్కరించుకోలేమా? ఆన్‌లైన్ ద్వారా కోర్టులు కూడా పనిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో భవనాలు కడుతామని ఎజెండా పెట్టుకోవడం నాకు అర్థం కాలేదు అని రాంగోపాల్ వర్మ అన్నారు.

  అమెరికా ఎన్నికల మాదిరిగానే

  అమెరికా ఎన్నికల మాదిరిగానే

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం, ఎన్నికల్లో గొడవలు చూడనంత వరకు ఆ దేశానికి నా దృష్టిలో గొప్ప గౌరవం ఉండేది. ఒక్కసారి ట్రంప్ ప్రచారం, విమర్శలు చూసిన తర్వాత వాళ్లు కూడా మనలాంటి వెధవలే అనే అభిప్రాయం కలిగింది. ఒకరి మీద ఒకరు విమర్శలు, తిట్టుకోవడం, ఆరోపించుకోవడం చూస్తే మా అసోసియేషన్ ఎన్నికలకు తేడా లేదని అనిపించింది అని వర్మ పేర్కొన్నారు.

  మా కు బిల్డింగ్ పెద్ద జోక్

  మా కు బిల్డింగ్ పెద్ద జోక్

  మా వ్యవహారాలు, వివాదాలను చూస్తే నాకు సర్కస్ మాదిరిగానే అనిపించింది. మా సంస్థకు బిల్డింగ్ ఉండటం అనేది పెద్ద జోక్. సినిమా ఓ కుటుంబం అని చెప్పుకోవడం చూస్తే నవ్వొస్తుంది. సినిమా ఓ ఫ్యామిలీ కాదు. చాలా ఫ్యామిలీ సమూహం. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. సినిమా పరిశ్రమ బాగుపడాలని ఎవరు కోరుకోరు. తాను బాగుపడాలని కోరుకునే వాళ్లే ఎక్కువ. సినిమా పరిశ్రమ భ్రష్టుపట్టిపోయినా ఎవడూ పట్టించుకోడు. తాను మాత్రమే లాభపడాలని కోరుకొంటారు అని ఆర్జీవి అన్నారు.

  కోవిడ్ తర్వాత అంతా ఆన్‌లైన్‌లోనే

  కోవిడ్ తర్వాత అంతా ఆన్‌లైన్‌లోనే

  కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రతీ ఒక్కరు ఆన్‌లైన్‌లో మీటింగులు పెట్టుకొంటున్నారు. ఆన్‌లైన్ మీటింగ్‌ల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. నా దృష్టిలో కూడా అసెంబ్లీలు కూడా సర్కస్‌గా కనిపిస్తాయి. జగన్ అన్న ఏం తిడుతాడు. ఆయన వెనుక ఎవరో బల్లలు చరుస్తారు అనేది తప్ప వేరే ఏది కనిపించదు. పిల్లలు చాక్‌పీస్‌లు విసురకొన్నట్టు ఎమ్మెల్యేలు పేపర్లు విసురుకొంటారు. అంతకంటే అసెంబ్లీలో ఏమీ కనిపించదు అని వర్మ అన్నారు.

  Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Filmibeat Telugu
  రాజకీయ గొడవల మాదిరిగానే మా ఎన్నికలు

  రాజకీయ గొడవల మాదిరిగానే మా ఎన్నికలు

  ఏదైతే అసెంబ్లీలో, రాజకీయ పార్టీల్లో కనిపించే విమర్శలు, ఆరోపణలు, కొట్టుకోవడం, కొరుక్కోవడం లాంటివి మా ఎన్నికల్లో కనిపించాయి. ఈ సందర్భంగా కొందరిని చూస్తే మానసిక వికలాంగుల్లా కనిపించారు. తెరమీద బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ వేసుకొని బిల్డప్స్ ఇచ్చే నటులు, హీరోలు... మా ఎన్నికల్లో మనకంటే అధ్వానం, మనకంటే వెధవలు.. జోకర్లమనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేశారు అని వర్మ అభిప్రాయం పడ్డారు.

  English summary
  Popular Director Ram Gopal Varma once again fires Satires on Politics and MAA Elections.He Said, Assembly functioning seems very comedy in AP and other states.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X