For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ విషయంలో ప్రపంచ చరిత్రలోనే బాలయ్య బెస్ట్... ఆ స్థాయి తనకు లేదన్న వర్మ

  |

  నందమూరి నటసింహం బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు. అభిమానులు కూడా ప్రపంచస్థాయిలో బాలయ్య బర్త్ డే వేడుకలను నిర్వహించారు. వరల్డ్ వైడ్‌గా దాదాపు 21 వేల కేకులు కోసి రికార్డులను నెలకొల్పారు. ఇదంతా ఒకెత్తు అయితే బాలయ్య బర్త్ డే కానుకగా శివ శంకరీ పాటను అభిమానులకు ఇచ్చాడు. బాలయ్యే స్వయంగా ఆలపించిన ఈ పాట తెగ వైరల్ అయింది. నెగెటివ్ కామెంట్లతో శివ శంకరీ పాట మార్మోగిపోయింది. మళ్లీ ఆ పాట, బాలయ్య గాత్రంపై ఆర్జీవీ సెటైర్స్ వేశాడు. అదేంటో ఓసారి చూద్దాం.

  Why Upcoming Directors Should've To Rake RGV As Inspiration ? || Filmibeat Telugu
  శివ శంకరీ పాటను..

  శివ శంకరీ పాటను..

  బాలయ్య బాబు నాటి క్లాసిక్ సాంగ్ శివశంకరీ పాటను ఆలపించడం చర్చనీయాంశం అయింది. ఏ ఒక్కరూ ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోలేదు. నాగబాబు, వర్మ వంటి వారు అయితే ఘోరంగా విమర్శించారు. సినీ ఇండస్ట్రీలోనూ దాదాపు అందరూ అనుకున్నారని టాక్. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరునికథలోని ఆ పాటను ఘంటసాల అద్భుతంగా పాడగా బాలయ్య కూనీ చేశారని సంగీత ప్రియులు బాధపడ్డారు.

  ప్రయత్నం చేశానన్న బాలయ్య..

  ప్రయత్నం చేశానన్న బాలయ్య..

  అయితే బాలయ్య మాత్రం విమర్శలపై స్పందిస్తూ.. తానేమీ గొప్పగా పాడానని చెప్పుకోవడం లేదని తెలిపాడు. ఏదో ఓ చిన్న ప్రయత్నం చేశానని విమర్శలకు సమాధానమిచ్చాడు. అయితే ఈ వివాదం అంతటి సమసిపోయినా వర్మ మాత్రం ఇంకా బాలయ్యపై సెటైర్స్ వేస్తూనే ఉన్నట్టు కనిపిస్తోంది.

  ఆర్జీవీ స్పందన.

  ఆర్జీవీ స్పందన.

  బాలయ్య పాటపై ఆర్జీవీ రియాక్షన్ అప్పట్లో తెగ వైరల్ అయింది. స్పందించాడు. ‘వావ్ మహమ్మద్ రఫీ, ఎస్పీబీ కూడా పాడటంలో జూనియర్లే. ఆయన పాడి పాట, ఆ స్వరాల, ఆ శబ్దాలు వింటే శ్రోతల హృదయ స్పందన పెరుగుతుంది. ఒతెల్లో బల్లాడ్ శంకర శాస్త్రి మోజార్ట్‌ల కలయికలా ఉంద'ని తెలిపాడు. మరో ట్వీట్ చేస్తూ.. ‘తన కామెంట్లను కొంతమంది చెడ్డవారు జోక్‌ చేశానని అంటున్నారు కానీ దేవుడు, బాలయ్య మీద ఒట్టేసి చెబుతున్నా.. సంగీతం కనుగొన్నప్పటి నుంచి నేటి వరకు విన్న పాటల్లో ఇదే గొప్ప పాట. నాకు తెలిసి స్వర్గంలోని ఎన్టీఆర్ కూడా సంతోషంతో గంతులు వేస్తుంటారు'అని మరో ట్వీట్ చేశాడు.

   తాజాగా మళ్లీ గెలికిన వర్మ..

  తాజాగా మళ్లీ గెలికిన వర్మ..

  తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య పాటపై వర్మ కామెంట్స్ చేశాడు. బాలయ్య గాత్రంపై స్పందిస్తూ.. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అంటూ మనుషులు సంగీతాన్ని కనుగొనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో బాలయ్యే బెస్ట్ సింగర్ అని కితాబిచ్చాడు.

   అంతటి స్థాయి కాదు..

  అంతటి స్థాయి కాదు..

  మరి అంతటి బాలయ్యకు మీ సినిమాలో పాడే అవకాశం ఇస్తారా? అని అడిగితే చిత్రమైన సమాధానమిచ్చాడు వర్మ. బాలయ్యకు తన సినిమాలో పాడే అవకాశం ఇవ్వలేనని, దానికి ప్రత్యేకమైన కారణం ఉందని, సింగర్‌గా ఆయన స్టాండర్డ్స్ వేరని, ఆయన పాడే వాటితో పోల్చుకుంటే తనవి చిన్న సినిమాలని చెప్పుకొచ్చాడు.

  English summary
  Ram Gopal Varma Satires On Balakrishna Singing Talent. He says that Fantastic, Mindblowing. Ever since the singing was invented by human beings, Balayya is the best singer I have seen in the world's history.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X