twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్నబ్ గోస్వామిపై బాలీవుడ్ ఫిర్యాదు.. ఒక్కే ఒక్క ట్వీట్‌తో స్టార్ హీరోల పరువుదీసిన ఆర్జీవీ

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై, డ్రగ్స్ కేసుపై అర్నబ్ గోస్వామి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. మినిట్ టు మినిట్ లైవ్ డిబేట్లు పెట్టి నానా హంగామా చేశాడు. లైవ్‌లోనే ఇన్వెస్టిగేషన్ చేసినంతగా ఊగిపోయాడు. సుశాంత్ కేసును ఎక్కడికో తీసుకెళ్దామనుకున్నాడు. కానీ ఏయిమ్స్ ఇచ్చిన రిపోర్ట్‌తో అంతా తలకిందులైంది. మళ్లీ అందులో ఏయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆడియో లీకైందని మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక డ్రగ్స్ కేసులోనూ బాలీవుడ్ ప్రతిష్ట దిగజార్చేలా కథనాలు ప్రచారం చేశారు. ఇక ఇలాంటివన్నీ చూసి చూసి ఉన్న బాలీవుడ్ పెద్దలు ఒక్కసారిగా తిరగబడ్డారు.

    అందరినీ ఆడుకున్నాడు..

    అందరినీ ఆడుకున్నాడు..

    మొదట సుశాంత్ సింగ్ కేసులో చర్చలు పెడుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోలను, ప్రొడ్యూసర్‌లను బజారుకీడ్చాడు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, అలియాభట్, మహేష్ భట్, ఆదిత్య చోప్రా ఇలా ఎంతో మంది గౌరవానికి భంగం కలిగే లైవ్ డిబేట్లు పెట్టారు. ఆ సమయంలో ప్రజలు కూడా వారందరిపై ఆగ్రహంతో ఉన్నారు.

    ఇక డ్రగ్స్ కేసులో..

    ఇక డ్రగ్స్ కేసులో..

    సుశాంత్ సింగ్ కేసులో భాగంగా డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది. అందులో భాగంగా రియాను అరెస్ట్ చేశారు. మళ్లీ తాజాగా రియా బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇక ఈ డ్రగ్స్ కేసుపై చర్చలు పెట్టిన ఆర్నబ్ ఓ రేంజ్‌లో ఊగిపోయాడు. లైవ్ అప్డేట్స్ అంటూ అందరినీ కించపరిచేలా కథనాలు ప్రచురించారు. ఇలా తమ ప్రతిష్టను కించపరిచినందుకు అర్నబ్‌పై బాలీవుడ్ మొత్తం తిరగబడింది.

     అందరూ కలిసి కేసులు..

    అందరూ కలిసి కేసులు..

    ఇలా తమపై తప్పుడు కథనాలు, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ సంస్థలు నిరాధారమైన వార్తలు ప్రసారం చేశాయంటూ ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్‌కు చెందిన 38 సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. ఇందులో అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రాకు చెందిన పలు సంస్థలున్నాయి. వీరంతా మూకుమ్మడిగా కలిసి కేసులు పెట్టడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు.

    అర్నబ్‌పై ఆర్జీవీ ఫైర్

    అర్నబ్‌పై ఆర్జీవీ ఫైర్

    మామూలుగా ఆర్జీవీ మొదటి నుంచి అర్నబ్ గోస్వామి తీరుపై మండి పడుతూనే ఉన్నాడు. అర్నబ్ చేసే పెంటపై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. ఒకానొక టైంలో విసుగొచ్చి ఏకంగా అర్నబ్‌పై సినిమానే ప్రకటించాడు. న్యూస్ ప్రాస్టిట్యూట్ అంటూ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. అలాంటి అర్నబ్‌పై బాలీవుడ్ లేటుగా స్పందించడం, ఫిర్యాదు చేయడంపై ఆర్జీవీ కౌంటర్ వేశాడు.

    Recommended Video

    #HBDSSRajamouli : Jr NTR to Ajay Devgn, Wishes Pour in on Twitter | Waiting For RRR
     స్కూల్ పిల్లల్లా...

    స్కూల్ పిల్లల్లా...

    బాలీవుడ్ ఇలా అర్నబ్‌పై ఆలస్యంగా స్పందించడంపై వర్మ సెటైర్ వేశాడు. ‘అర్నబ్‌పై బాలీవుడ్ రియాక్షన్ చాలా ఆలస్యమైంది.. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ డిల్లీ హైకోర్టు ముందుకు వెళ్లి స్కూల్ పిల్లల్లా టీచర్ వద్ద మొరపెట్టుకుంటున్నట్టుంది. టీచర్ టీచర్ అర్నబ్ మమ్మల్ని తిడుతున్నాడు అంటూ చెప్పినట్టుందని ఆర్జీవీ బాలీవుడ్ స్టార్ల పరువుదీశాడు.

    English summary
    Ram Gopal varma Satires On Bollywood About Late Reaction On Arnab Goswami, Reaction of Bollywood Is too late and too thanda ..All top film people complaining to Delhi high court is amounting to a school kid telling the teacher “ Teacher, Teacher , wo Arnab mujhe gaali de raha hai
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X