జూనియర్ ఎన్టీఆర్ ఓ వ్యాక్సిన్.. యంగ్‌టైగర్ ఆ సత్తా.. కాపాడే శక్తి ఆయనకే.. ఆర్జీవి సెటైర్లు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాల పరంగా రాణించకపోయినా.. సోషల్ మీడియాలో విమర్శకుడిగా బ్రహ్మండంగా నెట్టుకొస్తున్నారు. అంశం ఏదైనా గానీ.. చెంపపెట్టులా విమర్శించడంలో ఆర్జీవి కంటే గొప్ప ఎవరు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కొద్ది రోజులుగా కరోనావైరస్ గురించి
గత కొద్ది రోజులు కరోనావైరస్‌ను ఆధారంగా చేసుకొని పలువురిపై రాంగోపాల్ వర్మ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు, నారా లోకేష్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. తెలుగు దేశం పార్టీని బతికించడం ఎవరి వల్ల కాదంటూ.. కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుంది అంటూ కామెంట్ చేశారు.

నారా లోకేష్ ఓ వైరస్
నారా లోకేష్ అనే అతిసూక్ష్మ వైరస్ బారిన పడి తెలుగుదేశం దారుణంగా దెబ్బతిన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని కాపాడాలంటే కవేలం జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వల్లే అవుతుంది. కాబట్టి టీడీపీ క్యాడర్ చురుకుగా వ్యవహరించి ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి. లేకపోతే మీరు చనిపోతారు అంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తారక్ అనే వ్యాక్సిన్‌తో నయం
నేను చెప్పేది టీడీపీ కార్యకర్తలందరూ జాగ్రత్తగా వినండి.. చంద్రబాబు, నారా లోకేష్ లాంటి వైరస్ కారణంగానే టీడీపీ పార్టీ కరోనావైరస్ లాంటి వ్యాధికి గురి కావడం జరిగింది. కాబట్టి వెంటనే తారక్ అనే వ్యాక్సిన్ పార్టీకి ఇప్పించండి అంటూ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబుకు బర్త్ డే విషెస్
ఇక అంతటితో ఆగకుండా రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు. చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని సెటైర్లు వేశాడు. చంద్రబాబుకు నా జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నంత కాలం మీరు ఉండాలి. ఏపీ, మిమ్మల్ని విడదీసి చూడలేను అంటూ వర్మ మరో ట్విట్ చేశారు.
Recommended Video

చంద్రబాబు.. నీకు రెండు చేతులెత్తి మొక్కుతా
ఆంధ్రప్రదేశ్ పటం చూస్తే .. అది గుర్తుకు రాదు.. కానీ.. ఆ మ్యాప్‌ను చూస్తే మీరే గుర్తుకు వస్తారు. మన జన్మభూమిపై మీరు అంతటి ప్రభావాన్ని చూపించారు. హ్యపీ బర్త్ డే సార్.. మీరు చిరకాలం జీవించాలని రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నాను అంటూ వర్మ మరో ట్విట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











