అల్లు అర్జున్ రియల్ మెగా హీరో.. చిరంజీవి, రాంచరణ్‌పై వర్మ సెటైర్లు
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డ క్రమంలో సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు సిద్దమవుతున్న క్రమంలో ఈ సినిమా సంబంధించి చిరంజీవి, చరణ్ కలిసి ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా దాని మీద వర్మ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు

భారీ అంచనాలు
మొట్టమొదటి సారి రామ్ చరణ్‌తో చిరంజీవి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తోన్న చిత్రమే 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

అద్భుతమైన స్పందన
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీని ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. దీనికి మెగా అభిమానుల నుంచి మాత్రమే కాకుండా అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన దక్కింది. ఒక రకంగా ఈ సినిమా ట్రైలర్ కారణంగా సినిమా మీద అంచనాలు కూడా మరింత పెరిగాయని చెప్పాలి.

గ్రేస్ మూమెంట్ చేస్తే చాలు
సినిమా విడుదల దగ్గరపడడంతో సినిమా యూనిట్ 'భలే భలే బంజారా' పాటను 18న విడుదల చేయనుంది. విడుదలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కోసం చిత్ర యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ''భలే భలే బంజారా' పాటలో చరణ్ నన్ను డామినేట్ చేస్తాడని భయంగా ఉంది. మొన్న తారక్‌తో కలిసి నాటు నాటు అంటూ ఇరగదీశాడు కూడా' అని చిరంజీవి అనడం, దానికి చరణ్ 'మేము ఏం చేసినా మీరు వచ్చి గ్రేస్ మూమెంట్ చేస్తే చాలు' అనడం కనిపిస్తోంది.

తగ్గేదేలే అని
కొరటాల వెళ్లిపోయిన తర్వాత చిరు 'ఏరా నన్ను డామినేట్ చేస్తావా' అని చరణ్‌ను అడగ్గా 'అస్సలు తగ్గను' అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వీడియో పై వర్మ కామెంట్ చేశాడు. " నేను మెగా హర్ట్ అయ్యాను.. చిరంజీవి, చరణ్ తగ్గను. తగ్గేదేలే అని అల్లు అర్జున్ డైలాగ్స్ వాడుతుంటే.. చిరంజీవి, చరణ్.. బన్నీ న్యూ మెగా హీరో అని ఋజువు చేసినట్లు ఉంది" అంటూ కామెంట్లు చేశాడు.

రకరకాలుగా
ఈ క్రమంలో వర్మ ట్వీట్ మీద రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇక వర్మ ఇలా కావాలని మెగా ఫాన్స్ ను రెచ్చగొట్టడం కొత్త ఏమీ కాదు. ఒకప్పుడు పవన్ ను అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఎందుకో కానీ ఈ మధ్య సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇలా మెగాస్టార్ చిరంజీవి, చరణ్ లను టార్గెట్ చేశాడు.


Click it and Unblock the Notifications











