ట్రంప్ పక్కన సన్నీలియోన్ ఉంటే అది సాధ్యమే.. వర్మ దారుణమైన సెటైర్స్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏదైనా విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా ముక్కుసూటి మాట్లడటంలో మహా నేర్పరి అనే విషయం అందరికీ తెలిసిందే. ఏ విషయంపైనైనా ఆయన ట్విట్టర్లో ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు ట్వీట్లు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అనిపిస్తారు. తాజాగా భారత్‌లో ట్రంప్ పర్యటనపై వర్మ సంధించిన విమర్శనాస్త్రాలు ఆశ్చర్యకరంగా మారాయి. వివరాల్లోకి వెళితే..

Recommended Video

If Sunny Leone Stand Next To Trump 10 Million People Welcome Him | Filmibeat Telugu
విదేశీ అతిథులను ఇంప్రెస్ చేయడానికి

విదేశీ అతిథులను ఇంప్రెస్ చేయడానికి


దేశంలో పర్యటించే విదేశీ అతిథులను, ప్రముఖులను ఇంప్రెస్ చేయడానికి లెక్కలేనంత ధనం ఖర్ఛుపెట్టడం ఫ్యూడల్ వ్యవస్థను గుర్తు చేస్తుంది. ఇలాంటి వ్యవహారాలకు అమెరికా ఎప్పుడో ముగింపు పలికింది. కానీ బానిసత్వాన్ని అలవాటు చేసుకొన్న మనం ఇలాంటి వాటిని నుంచి బయట పడలేకపోతున్నాం అని రాంగోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్ హావభావాలు ఎలా ఉంటాయో..

భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలను చూసేటప్పుడు ట్రంప్ ముఖంలో హావభావాలు ఎలా ఉంటాయో చూడాలని ఆతృతగా ఉంది. ట్రంప్‌ను నేను గమనించి తీరు చూస్తే.. మన సంప్రదాయ కార్యక్రమాలను చూడలేక చచ్చిపోతాడనుకొంటాను అని వర్మ మరో సైటైర్ వేశాడు.

వేల కోట్లు అవసరమా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలకడానికి భారతీయులం వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ అమెరికాలో నరేంద్రమోడీకి స్వాగత పలకడానికి అమెరికన్లు వేల రూపాయలైనా ఖర్చు పెట్టడం చూశామా? అదే అమెరికాకు మనకు ఉన్నా తేడా అంటూ వర్మ ట్విట్టర్‌లో మరో సెటైర్ వదిలాడు.

మనలో ఎవరైనా చూస్తారా?

మనలో ఎవరైనా చూస్తారా?

ట్రంప్‌ను పక్కన పెడితే మన సంప్రదాయ కార్యక్రమాలను ఏ ఒక్క భారతీయుడైనా చూస్తారా అనే విషయం నాకైతే తెలియదు. అలాంటి కార్యక్రమాలను చూసి ఆనంద పడుతారనే అనుకోవడం సరికాదు. భారతీయ సంప్రదాయ నృత్యాలు, కార్యక్రమాల కంటే బాలీవుడ్ నైట్ పెడితే మంచిగా ఉండేదేమో అంటూ వర్మ మరో ట్విట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్‌కు కోటి మందితో స్వాగతం

ట్రంప్‌కు కోటి మందితో స్వాగతం పలకడం సాధ్యమవుతుందా? అంటే.. అమితాబ్‌ బచ్చన్ గానీ, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకోన్, సన్నిలీయోన్‌ను ట్రంప్ పక్కన నిలబెడితే కోటి మంది రావడం సాధ్యం కావొచ్చు అని వర్మ మరో ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X