RGV ‘వాడు పిచ్చి నా కొడుకు’.. లోకేష్‌పై విరుచుకుపడ్డ రాంగోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో టీడీపీ నేత నారా లోకేష్‌పై భారీగా సెటైర్లు వేశారు. ఇటీవల లోకేష్ చేసిన కామెంట్లపై విమర్శలు చేశారు. ప్రజలకు మంచి ఏం చేస్తాడని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన గురించి కూడా విమర్శ చేయడం రాదా? అంటూ ఎద్దేవా చేశారు. తాజాగా సోషల్ మీడియాలో తన అకౌంట్లలో వీడియో పెట్టి లోకేష్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆర్జీవి వీడియో వివరాల్లోకి వెళితే..
రాంగోపాల్ వర్మ ఇటీవల రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకొని ఆనందపడిన విషయం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు లోకేష్ స్పందిస్తూ.. ఆయన సమాజానికి ఏం మంచి పనిచేశాడు? అని అన్నాడు. అలాగే వ్యూహం సినిమా ద్వారా ఏం సాధించాలని అనుకొంటున్నాడు అంటూ కామెంట్ చేశాడు. దానికి ఆర్జీవి కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు.

లోకేష్.. నాకు నిన్ను చూసి జాలి పడాలా? నవ్వాలా? ఏడ్వాలా? అనే విషయం తెలియడం లేదు. నేను రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం పడుతాను. నేను ఏం చేయాలి? నేను ఫిలిం మేకర్‌ను. నేను నీలాగా ప్రజా సేవ చేస్తానని నీలాగ చెప్పానా? నా పాయింట్ ఏమిటంటే.. నీవు నన్ను విమర్శించాలంటే.. వేరే టాపిక్ దొరకలేదా? నేను నీ ప్లేస్‌లో ఏం చెప్పేవాడిని తెలుసా? అని రాంగోపాల్ వర్మ అన్నాడు.
నీ స్థానంలో నేనుంటే.. వాడు పిచ్చి నా కొడుకు.పిచ్చి సినిమాలు చేస్తాడు. అడ్డదిడ్డంగా ట్వీట్లు పెడుతాడు. అలాంటోడికి నేను జవాబు ఇవ్వాలా? అని చెప్పొచ్చు కదా.. అంతకంటే.. వాడు పొద్దున్న లేచి పోర్న్ చూస్తాడు. బాధ్యతలేని వ్యక్తి అని చెప్పొచ్చుగా. ఆ మాత్రం తెలియకుండా ఉంటే ఎలా బేబీ అంటూ సెటైర్ వేశాడు.
నా వెనుక ఉన్న ఫోటోలు చూశావా? నీలాగా స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో ఎంజాయ్ చేసి ఫోటోలను దాచుకోను. ఎంత సింపుల్ విషయాలు నీకు తెలియకపోతే ఎలా? చంద్రబాబు ఉన్న పరిస్థితిని చూసి నీ మైండ్ ఏమైనా దెబ్బ తిందా? అదైనా చూపించుకొంటే బాగుంటుంది అని వర్మ అన్నాడు.
నా లాంటి వాడిని విమర్శించడం రాకపోతే చంద్రబాబును ఎవరు కాపాడలేదు. ఢిల్లీ, లండన్‌కు వెళ్లి చూపించుకొంటే మైండ్ సెటిల్ అవుతుందేమో. ఊరికేనే హైరానా పడితే ఎలా.. అందుకే నీకు సలహా ఇస్తున్నా. నీకు నీవు జాగ్రత్తగా చూసుకో అని వర్మ తనదైన శైలిలో ఆర్జీవి ట్విట్టర్‌లో వీడియో రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











