గిన్నెలు కడగడం, అంట్లు తోమడం కాదు.. టాలీవుడ్ ప్రముఖుల‌పై వర్మ సెటైర్స్

ఆర్జీవీ అంటే అంతే మరి ఊహకు అందడు. లాక్‌డౌన్ పీరియడ్‌లో ఏకంగా ఓ సినిమాను తెరకెక్కించేశాడు. కరోనా వైరస్‌ గుప్పిట్లో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంటే.. దానిపై ఓ సినిమాను తీశాడు. కరోనా వైరస్ పేరిట రిలీజ్ చేసిన ట్రైలర్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. లాక్ డౌన్‌లోనే కథను డిసైడ్ చేశానని, లాక్‌డౌన్‌లోనే షూట్ చేసేశాని చెప్పుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై వస్తోన్న మొదటి చిత్రమని పేర్కొన్నాడు. తాజాగా తన ఘనత గురించి చెబుతూ సినీ ఇండస్ట్రీపై ఓ సెటైర్ వేశాడు.

Recommended Video

#CoronaVirusTrailer : RGV Punch On Tollywood Actors And Directors
 లాక్‌డౌన్ నేపథ్యంలో..

లాక్‌డౌన్ నేపథ్యంలో..

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇంటి పట్టునే ఉన్నారు. కరోనా వార్తల గురించి వింటూ భయాందోళనకు గురవుతూ ఉండేవారు. ఓ ఫ్యామిలీలో కరోనా భయం పట్టుకుంటే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఓ ఇళ్లు, ఇంటి సభ్యుల చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతున్నట్టు తెలుస్తోంది.

బిగ్‌బీ ప్రశంసలు..

బిగ్‌బీ ప్రశంసలు..

కరోనా వైరస్ ట్రైలర్‌పై బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించాడు. అందరికీ అర్థం కాని రామ్ గోపాల్ వర్మ.. కొందరికి రాము కానీ నాకు మాత్రం సర్కార్. లాక్‌డౌన్‌లో ఓ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లాక్ డౌన్‌లోనే షూట్ చేశాడు.. కరోనా వైరస్ మీద మొట్టమొదటి సినిమా' అంటూ ట్వీట్ చేశాడు.

సెలెబ్రిటీలంతా అలా..

సెలెబ్రిటీలంతా అలా..

అయితే ఈ లాక్‌డౌన్‌లో సెలెబ్రిటీలంతా బీ ది రియల్ మ్యాన్ చాలెంజ్ అంటూ ఇళ్లు శుభ్రపర్చడం, బోళ్లు తోమడం, బట్టలు ఉతకం వంటివి చేస్తూ సవాళ్లు విసురుకున్నారు. వీటిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్ వేశాడు.

వారిలా నేను కాదు..

వారిలా నేను కాదు..

వర్మ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘సినిమా పరిశ్రమకు చెందిన మిగతా వారంతా ఇళ్లు తుడవడం, వంట వండటం, బట్టలు ఉతకడం, బోళ్లు కడగడం వంటివి చేస్తే.. నేను ఓ సినిమాను తెరకెక్కించాను' అంటూ కండలు చూపిస్తున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X