twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi ఏనుగు.. నీ స్థాయి ఏంటో నీకు తెలుసు.. అలా మొరగొద్దు.. గరికపాటిపై ఘాటుగా ఆర్జీవీ ట్వీట్లు

    |

    మెగాస్టార్ చిరంజీవిపై ఆధ్యాత్మిక గురువు గరికపాటి నర్సింహరావు నోరుజారడం తీవ్ర వివాదంగా మారింది. అయితే చిరంజీవిపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వివాదం తెరపడిందని అందరూ అనుకొంటుండగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కెలకడం ఆసక్తికరంగా మారింది. అయితే చిరంజీవి, గరికపాటి వివాదం ఏమిటి? రాంగోపాల్ వర్మ ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే విషయంలోకి వెళితే..

    దత్తాత్రేయ అలయ్ బలయ్ వేడుకలో

    దత్తాత్రేయ అలయ్ బలయ్ వేడుకలో

    దసరా పండుగ మరుసటి రోజున ప్రతీ ఏటా నిర్వహించినట్టే రాజకీయ నేత, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ బండారు హైదరాబాద్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక వర్గాలతోపాటు చిరంజీవి, గరికపాటి నర్సింహరావు హాజరయ్యారు. అయితే గరికపాటి నర్సింహారావు ప్రసంగం ప్రారంభించిన సమయంలో చిరంజీవి కొందరితో ఫోటోలు దిగుతుండటంతో ఆయన అసహనానికి గురయ్యారు. చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే తాను వెళ్లిపోతానని హెచ్చరించాడు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

    ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే

    ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే

    మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి అసహనం వ్యక్తం చేయడంపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..అంటూ ట్వీట్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాత గరికపాటిపై ఏదో మూడ్‌లో అని ఉంటారని మరో ట్విట్ చేశారు. దాంతో గరికపాటి వివాదం సద్దుమణిగింది.

    గుర్రంపాటి అంటూ కామెంట్

    గుర్రంపాటి అంటూ కామెంట్

    ఇక గరికపాటి నర్సింహరావుపై నాగబాబు చేసిన ట్వీట్‌పై రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఐ యాం సారీ.. నాగబాబు గారు.. మెగాస్టార్‌ను అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె...* అంటూ వర్మ ట్వీట్ చేశారు.

    ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. అంటూ

    ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. అంటూ

    గరికపాటిపై ఒక ట్వీట్‌తో ఆగకుండా వరుస ట్వీట్లతో రచ్చ చేశారు. 'హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో అంటూ మరో ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా మరో ట్విట్‌లో 'హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి..
    నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి అంటూ వివాదాస్పదంగా ట్వీట్ చేశారు.

    గడ్డిపరిక లాంటి గరికపాటిని అంటూ

    గడ్డిపరిక లాంటి గరికపాటిని అంటూ

    చిరంజీవిపై గరికపాటి నర్సింహరావు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ..
    సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కానీ అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు 🙏🙏 అని వర్మ మరో ట్వీట్ చేశారు.

    English summary
    Ram Gopal Varma satirical tweets on Chiranjeevi, Garikapati Narsimha Rao contraversy at alai balai which conducted by Bandaru Dattatreya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X