twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV గుడివాడలో క్యాసినో.. అమ్మాయిల అశ్లీల నృత్యాలు.. కొడాలి నానిపై విరుచుకుపడ్డ రాంగోపాల్ వర్మ

    |

    కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సమయంలో క్యాసినో, గ్యాంబ్లింగ్, పేకాట శిబిరాలను నిర్వహించారనే విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా మంత్రి కొడాలి నాని పర్యవేక్షణలోనే ఇవి జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ఈ క్రమంలో కొడాలి నానిపై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేస్తూ..

    Recommended Video

    RRR Movie టికెట్ ప్రైస్ రాజమౌలి డిసైడ్ చెయ్యాలి.. AP Govt కి ఎందుకు ? - RGV | Filmibeat Telugu
    బౌన్సర్లను పెట్టి జూదం.. 10 వేల టికెట్‌తో

    బౌన్సర్లను పెట్టి జూదం.. 10 వేల టికెట్‌తో

    సంక్రాంతి పండుగ నేపథ్యంలో గుడివాడలోని ఓ ఫంక్షన్ హాలులో కోడిపందేలు, పేకాట శిబిరాలతోపాటు కాసినోను నిర్వహించారు. కాసినోలోకి వెళ్లడానికి కస్టమర్లకు రూ.10 వేల టికెట్‌ను పెట్టారు. పదివేలు చెల్లిస్తే గానీ కాసినోలోకి అనుమతించలేదనే విషయం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమైంది. ఈ కాసినో బయట ప్రత్యేకంగా బౌన్సర్లను పెట్టి జుదం, బెట్టింగ్‌, గ్యాబ్లింగ్‌ను నిర్వహించారు అనే ఆరోపణలు వచ్చాయి.

    క్యాసినోతోపాటు అమ్మాయిలతో డ్యాన్సులు

    క్యాసినోతోపాటు అమ్మాయిలతో డ్యాన్సులు

    ఇక అంతేకాకుండా రాష్ట్రమంత్రి ఆధ్యర్యంలోనే క్యాసినో, గ్యాంబ్లిగ్ క్రీడలు నడిచాయి. అంతేకాకుండా అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారనే ఆరోణలను తెలుగుదేశం పార్టీ నేతలు చేయడం వివాదంగా మారింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌కు, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణాధికారిని నియమించి దర్ాయప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమవుతున్నాయి.

    గోవా, లాస్ వెగాస్‌ను తలదన్నేలా గుడివాడ

    గోవా, లాస్ వెగాస్‌ను తలదన్నేలా గుడివాడ

    మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేస్తూ.. గుడివాడను ఆధునిక, నాగరిక ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన ప్రయత్నానికి నేను మనస్పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. గుడివాడలో కాసినో పెట్టడం తిరోగమన చర్య అంటున్న ప్రజలు అంటున్నారు. మీరు వాటిని పట్టించుకోవద్దు. జై గుడివాడ అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. గుడివాడలో కాసినో పెట్టిన కొడాలి నానిని తప్పుపట్టిన వారికి నేను ఓ ప్రశ్న వేస్తున్నాను. మీలో ఎవరైనా గోవాను, లాస్ వెగాస్‌ను తలదన్నేలా కొడాలి నాని ప్రయత్నించారనే విషయాన్ని గ్రహించారా అంటూ వర్మ ప్రశ్నించారు.

    గుడివాడ ప్రజలంతా చీకటి ప్రపంచంలోనే..

    గుడివాడ ప్రజలంతా చీకటి ప్రపంచంలోనే..


    గుడివాడ పట్టణాన్ని పారిస్, లండన్, లాస్ వెగాస్ సరసన నిలుపాలని ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన ప్రయత్నం అభినందనీయం. అందుకు నేను ఆయనను ఆరాధిస్తున్నాను అని మరో ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు. కాసినో పెట్టాలని కొడాలి నాని తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్లంతా.. అభివృద్ది నిరోధకులు. వాళ్లంతా ఇంకా చీకటి యుగంలోనే ఉన్నారనిపిస్తుంది అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు.

    కొడాలి నానిని విమర్శించే వాళ్లు మూర్ఖులు.. అంటూ

    కొడాలి నానిని విమర్శించే వాళ్లు మూర్ఖులు.. అంటూ

    గోవా సంస్కృతిని గుడివాడకు కొడాలి నాని తీసుకొచ్చారని కొందరు మూర్ఖులు ఆరోపిస్తున్నారు. గుడివాడ ప్రజలు ఒక్క విషయంలో రియలైజ్ కావాలి. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్తారు. కానీ గోవా ప్రజలు గుడివాడకు రారు అనే విషయాన్ని గుర్తించడం లేదు. ఏదిఏమైనా గుడివాడను మోడర్నైజ్ చేయాలని కొడాలి నాని తీసుకొన్న నిర్ణయానికి నేను ఫిదా అవుతున్నాను అని రాంగోపాల్ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Director Ram Gopal Varma satirical tweets on Minister Kodali Nani over Casino, Gambling in Gudivada. The dumbos who are accusing IamKodaliNani for bringing GOA culture to GUDIVADA should realise that GUDIVADA people will go to GOA but GOA people don’t come to GUDIVADA Nani Garu should be admired for trying to modernise GUDIVADA
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X