For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ హీరో కావడమే చిరంజీవికి పెద్ద షాక్.. సినీ చరిత్రలోనే బన్నీ గ్రేట్.. RGV షాకింగ్‌ కామెంట్స్

  |

  మెగా ఫ్యామిలీలోని వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ వాళ్లంతా చిరంజీవి మీద ఆధారపడే హీరోలు. చిరంజీవి కారణంగానే వాళ్లకు సక్సెస్ లభించింది. కానీ అల్లు అర్జున్ స్వయంగా హీరోగా ఎదిగాడు. చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు అల్లు అర్జున్ దూరంగా ఉండటం ఆయన తెలివికి నిదర్శనం అంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఇండస్ట్రీలోను, సోషల్ మీడియాలోను దుమారం సృష్టించాయి. తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా టెలివిజన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ తన వ్యాఖ్యల్లో తప్పు లేదని వెల్లడించారు. ఆర్జీవి చెప్పిన మాటలు ఏమిటంటే..

  Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ

  చిరంజీవి లేకపోతే వాళ్లు లేరు..

  చిరంజీవి లేకపోతే వాళ్లు లేరు..

  చిరంజీవి రియల్ మెగాస్టార్. ఆయన తర్వాత మళ్లీ అల్లు అర్జున్ గ్రేటెస్ట్ మెగా స్టార్. మిగితా వాళ్లందరూ చిరంజీవి లేకపోతే మేము లేము అని అంటున్నారు. చిరంజీవి వల్లే మేము స్టార్లం అయ్యామంటే అంటే నెపోటిజం కిందకు వస్తుంది. అయితే వాళ్లు తెలిసే తెలియకో చిరంజీవి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పడమే వివాదం. అయితే అల్లు అర్జున్ ఎవరంటే.. స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ అనే ప్రొడ్యూసర్ కొడుకు. మిగితా వారితో పోల్చుకొంటే బన్నీ సక్సెస్ చాలా బెటర్ అని రాంగోపాల్ వర్మ అన్నారు.

  అల్లు అర్జున్‌తో సినిమా తీద్దామనుకొన్నా

  అల్లు అర్జున్‌తో సినిమా తీద్దామనుకొన్నా

  మెగా కంపౌండ్‌లో అంతర్గత విభేదాలు. పాలిటిక్స్ ఉన్నాయో తెలియవు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అల్లు అర్జున్ నటుడు కాకముందు నేను కలిశాను. అయితే ఆ ప్రాజెక్టు వర్కవుట్ కాలేదు. అది వేరే విషయం. గంగోత్రి సినిమా వచ్చినప్పుడు కమెడియన్ మనవడు హీరో కావడం జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అప్పుడు హీరో కొడుకు హీరో అనే కాన్సెప్ట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ అయ్యాడు అని రాంగోపాల్ వర్మ తన ట్వీట్‌కు వివరణ ఇచ్చారు.

  కమెడియన్ ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్‌గా

  కమెడియన్ ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్‌గా

  పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇతర మెగా హీరోల సక్సెస్ కన్నా అల్లు అర్జున్ సక్సెస్‌ ఎక్కువ. ఎందుకంటే వాళ్లంతా చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు.. అల్లు అర్జున్ మాత్రం ఓ కమెడియన్ మనవడు మాత్రమే. ప్రపంచ చరిత్రలో కమెడియన్ ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన దాఖలాలు లేవు. కానీ అల్లు అర్జున్ దాన్ని అధిగమించాడు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

  మెగా హీరోలందరూ పారాసైట్సే

  మెగా హీరోలందరూ పారాసైట్సే

  హీరోల కొడుకులు హీరోలుగా రాణించలేదు. కృష్ణ కుటుంబం నుంచి రమేష్ హీరో కాలేకపోయాడు.. అదే మహేష్ బాబు హీరో అయ్యారు. దాసరి, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు ఎంతో మంది హీరోలను పరిచయం చేశారు. కానీ వాళ్ల పిల్లలను మాత్రం హీరోలుగా చేయలేకపోయారనే విషయాన్ని రాంగోపాల్ వర్మ సమర్థించారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మెగా హీరోలందరూ పారాసైట్స్ అని నేను అనడం లేదు. వాళ్లకు వాళ్లే చెప్పుకొంటున్నారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

  అల్లు అర్జున్ ఇండిపెండెంట్ స్టార్

  అల్లు అర్జున్ ఇండిపెండెంట్ స్టార్

  మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఎదిగిన హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమా వచ్చినప్పుడు చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరో అని అతడిని ఎవరూ చూడలేదు. కొన్ని కారణాల వల్ల ప్రేక్షకులు మెచ్చి అల్లు అర్జున్‌ను హీరోగా చేశారు. అందుకే నేను అల్లు అర్జున్‌ ఇండిపెండెంట్ స్టార్ అంటాను. బన్నీ హీరో అవ్వడమే చిరంజీవికి పెద్ద షాక్. సర్కార్ ప్రీమియర్ సమయంలో అల్లు అర్జున్‌ను పట్టుకొని.. చరణ్ వస్తున్నాడు.. నీకు ఇక ఇండస్ట్రీలో నూకలు ఉండవన్నట్టు కొందరు మెగా ఫ్యాన్స్ మాట్లాడారు. ఆ సమయంలో బన్నీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని రాంగోపాల్ వర్మ తన అనుభవాన్ని బయటపెట్టారు.

  చిరంజీవి కంటే మించి డ్యాన్స్

  చిరంజీవి కంటే మించి డ్యాన్స్

  అల్లు అర్జున్‌లో ఒక్క మంచి గుణం ఉంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా తన పని తాను చేసుకొంటూ వెళ్తుంటారు. అది చేస్తా.. ఇది చేస్తా అంటూ ప్రగల్బాలు పలకడు. ఎవరూ చేయని విధంగా చిరంజీవిని మించి డ్యాన్స్ చేస్తాడు. అయితే చిరంజీవి, అల్లు అర్జున్‌ను పోల్చి చూడటం సరికాదు. కాకపోతే ఇప్పటి రోజుల్లో అల్లు అర్జున్ బెటర్ డ్యాన్సర్. మెగా హీరోల్లో ఎవరూ కూడా అల్లు అర్జున్ మాదిరిగా డ్యాన్స్ చేయలేదు. ఈ జనరేషన్‌లో అల్లు అర్జున్ టాప్ డ్యాన్సర్ అని రాంగోపాల్ వర్మ అన్నారు.

  Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
  చాప కింద నీరులా బన్నీ...

  చాప కింద నీరులా బన్నీ...

  టాలీవుడ్‌లో మహేష్ బాబు‌ను హీరోగా లాంచ్ చేశారు. రాంచరణ్‌ను హీరోగా లాంచ్ చేశారు. కానీ అల్లు అర్జున్ ఎవరూ కూడా లాంచ్ చేయలేదు. చాప కింద నీరులా బన్నీ సూపర్ స్టార్ అయ్యారు. చిరంజీవి కూడా అలానే చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెగాస్టార్ అయ్యారు. అయితే గంగోత్రి సమయంలో ఇతను హీరో ఏమిటని నాతో పాటు అందరూ అనుకొన్నారు. అందరి అంచనాలను తలకిందులూ చేయడమే కాకుండా నేను కూడా తప్పు అని ప్రూవ్ చేశాడు. అందుకే బన్నీ తదుపరి మెగాస్టార్ అని ట్విట్టర్‌లో మూడు లైన్లు పెట్టలేదు. నా ట్వీట్ల వెనుక చాలా అవగాహన, ఆలోచనలు ఉన్నాయి అని రాంగోపాల్ వర్మ వివరణ ఇచ్చారు.

  English summary
  Popular Director Ram Gopal Varma made hot comments Mega Heroes as Parasites. He spoke to media over comments and given clarity behind his tweets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X