రామ్ గోపాల్ వర్మ పాత డైలాగ్, హజారే ఎవరో తెలియదని కామెంట్
బాలీవుడ్ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మరోసారి తన తిక్కను ప్రదర్శించారు. అన్నా హజారే ఎవరో తెలియదని కామెంట్ చేశారు. అన్నా హజారే ఎవరు? ఆయన దీక్ష ఎందుకు చేస్తున్నారు? నాకేం తెలియదే అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న సంఘ సంస్కర్త అన్నా హజారే తనకు తెలియదని వర్మ శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
''నాకు హజారే గురించి, ఆయన ఎందుకు ఆమరణ దీక్ష చేస్తున్నారో తెలియదు. నేను నా సినిమాలతో ఎంతో తీరిక లేకుండా ఉన్నా. నా ఆహార నియమాల గురించి తప్ప ఇంక దేనికీ నిరాహార దీక్ష చేయనని చెప్పుకొచ్చారు. అవినీతి గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. ఫేస్‌బుక్, ట్విట్టర్ సైట్లలో కనిపిస్తున్న హడావుడి భౌతికశక్తిగా మారుతుందని ఆశిస్తున్నా'' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











