నీ కాలు చీకాలని ఉంది.. రాంగోపాల్ వర్మ షాకింగ్‌గా మరో ట్వీట్.. ఈసారి ఎవరి పాదాలు అంటే?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్, ఏదైనా అంశంపై రియాక్ట్ అయ్యే విధానం ఎప్పటికప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు, స్టార్ సెలబ్రిటీలపై ఆయన చేసే ట్వీట్స్ పాజిటివ్ గా ఉంటూనే నెగెటివిటీని చూపిస్తాయి. పొగుడుతూ చెబుతున్నారో.. విమర్శిస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకునే వారితో పాటు నవ్వి ఊరుకునే వారు ఎంతో మంది. ఇక అప్పుడప్పుడు తన ట్వీట్స్ వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవల మెగా బ్రదర్స్ పై కామెంట్స్ తో కాంట్రవర్సీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళిని హత్య చేసేకుందుకు కుట్ర పన్నుతున్నారని ట్వీట్ చేసి షాక్ ఇచ్చాడు ఆర్జీవీ.

సర్కార్ వంటి సినిమా..

సర్కార్ వంటి సినిమా..

తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప గొప్ప చిత్రాలు చేసి అతి తక్కువ కాలంలో దేశంలోనే క్రేజీ అండ్ విభిన్న దర్శకుడిగా పేరు సంపాదించాడు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దాదాపు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. మరెవరికీ దక్కని రకంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సర్కార్ వంటి సూపర్ హిట్ సినిమాలు సైతం తెరకెక్కించాడు.

 హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలు..

హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలు..


ఇక రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే ఫాలోయింగ్ దక్కుతూ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన కేవలం అమ్మాయిలనే హైలైట్ చేసే సినిమాలు తీస్తున్నాడు. ఇందులో భాగంగానే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటిలో కొన్ని థియేటర్లలో విడుదల చేయగా మరికొన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకు వచ్చాడు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత..

అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా ఒక సినిమా తెరకెక్కించనున్నట్లు ఇటీవల ప్రకటించాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అది పూర్తిగా బయోపిక్ కాదని.. కానీ నిజ సంఘటనల ఆధారంగా మాత్రం తెరకెక్కిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తోన్న శైలి అందరికీ షాకిస్తోంది. అంతలా ఆయన రచ్చ చేస్తున్నారు.

ఇతర దర్శకుడు భయపడేలా..


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు మాత్రమే కాకుండా ట్వీట్లు సైతం ఆశ్చర్యకరంగా, వివాదాస్పదకరంగా, ఇంట్రస్టెంటింగ్ ఉంటున్నాయి. ఇదిలా ఉంటే దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పేరు వస్తుంది తెలిసిందే. ప్రస్తుతం RRRకు అవార్డుల పంట కొనసాగుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత ఇతర దర్శకులు భయపడేవిధంగా ఇండియన్ సినిమా స్థాయిని రాజమౌళి పెంచారని ఆర్జీవీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇలా ఊహించి ఉండరు..

తాజాగా మరోసారి రాజమౌళి గురించి ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు ఆర్జీవి. రాజమౌళి ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తో మాట్లాడటం, ఆయన జక్కన్నతో హాలీవుడ్ సినిమా గురించి మాట్లాడే వీడియోను షేర్ చేస్తూ ఈ ట్వీట్స్ చేశారు ఆర్జీవీ. "దాదా సాహెబ్ ఫాల్కే నుంచి చివరికి రాజమౌళి వరకు భారతీయ సినిమా చరిత్రలోనే ఓ ఇండియన్ డైరెక్టర్ ఇలాంటి అపూర్వమైన క్షణాలను ఓ రోజు అనుభవిస్తాడని ఊహించి ఉండరు" అని ట్విట్ లో రాసుకొచ్చారు.

చంపేందకు ప్రయత్నిస్తున్నారు..

మరి కొన్ని ట్వీట్స్ లో "హే రాజమౌళి.. నువ్వు మొఘల్ అజామ్ చిత్రాన్ని తెరకెక్కించిన కా ఆసీఫ్ మొదలు కొని షోలే తీసిన రమేష్ సిప్పీ వరకు అందరినీ అధిగమించి.. ఆదిత్య చోప్రాలు, కరణ్ జోహార్ లు, బన్సాలీలను దాటేశావ్. ఈ విషయంలో నీ కాలి చిటికెన (బొటన) వేలిని చీకాలని ఉంది", "రాజమౌళి సర్.. మీరు మీ సెక్యూరిటీనీ పెంచుకోండి. ఎందుకంటే ఇండియాలోని కొందరు ఫిల్మ్ మేకర్స్ మీపై అసూయతో గ్రూపుగా ఏర్పడి మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. కానీ, నాకు 4 రౌండ్లు పడేసరికి నిజం చెప్పేస్తున్నాను" అని రాసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X