twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు ఏడుపుని కూడా వాడేసుకున్న వర్మ.. థాంక్స్ అంటూ ట్వీట్

    |

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, ప్రెస్‌ మీట్‌ లో ఏడవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు అలా ఏడవడం బాలేదని అనేక మంది అభిప్రా పడుతున్నారు. అయితే దేనిని కూడా తన ప్రమోషన్స్ కు వాడుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Chandrababu Crying - RGV Reacts నీ పెళ్ళాన్ని అంటే తెలిసేది నొప్పి..!! || Oneindia Telugu
    అసభ్యంగా మాట్లాడారంటూ

    అసభ్యంగా మాట్లాడారంటూ

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ- అధికార పక్ష వైసీపీ మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురై సీఎం అయ్యాకే తిరిగి అసెంబ్లీలో అడుగెడతానని శపథం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు సభలో తన భార్య ప్రస్తావన తెచ్చి అసభ్యంగా మాట్లాడారంటూ బోరున విలపించారు.

     నీళ్లు లేకపోయినా...

    నీళ్లు లేకపోయినా...

    ఈ నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు మీద టీడీపీ శ్రేణులు మండి పడుతున్నారు. అయితే బాబు ఏడ్చిన విషయం మీద సీఎం జగన్‌ అసెంబ్లీలో సెటైర్లు వేశారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా... నీళ్లు వచ్చాయని జగన్ అన్నారు. చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా అని... అన్ని రాజకీయాల కోసమేనని మండిపడ్డారు.

     ఎల్లో మీడియా

    ఎల్లో మీడియా

    ఇక దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంత కాలం ఎల్లో మీడియా తనని నేను ఏం చేయలేదన్నారు. రైతుల చర్చలో విపక్ష సభ్యులు లేకపోవడం దురదృష్టకరమన్న ఆయన చంద్రబాబు సంబంధం లేని విషయాలను తీసుకు వచ్చి రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగ హత్య, మాధవరెడ్డి హత్య చంద్రబాబు హయాంలోనే జరిగాయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ట్రైలర్ విడుదల చేసి

    ట్రైలర్ విడుదల చేసి


    అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్ అనే సినిమాతో వస్తున్నా అన్న వర్మ ఇప్పుడు మూవీ ప్రమోషన్ మొదలెట్టాడు. ఇందులో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఉదయం విడుదల చేసి ఆసక్తి రేపారు. ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ 'ఒక్క సీటు కూడా రాలేదా' అని బాధ పడుతున్న ఓ పొలిటికల్ లీడర్ ని చూపించడంతో ప్రారంభమైంది.

    ఆర్జీవీ కనపడడం లేదు

    ఆర్జీవీ కనపడడం లేదు

    ఇక ఆర్జీవీ కనపడటం లేదని ఆయన అసిస్టెంట్లు కంప్లైంట్ ఇస్తే కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్ గా భావించి పోలీసులు మిస్సింగ్ కేసును లైట్ తీసుకుంటారు. కానీ ఆ తర్వాత అదే నిజమని తెలుస్తుంది. వర్మ కిడ్నాప్ వెనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ లేదా మాజీ ముఖ్యమంత్రి-అతని కుమారుడు అనుమానితులని అందులో చూపారు.

    బాబుని వదలకుండా

    అయితే ఆర్జీవీ మిస్సింగ్ కేసుని ఛేదించడానికి సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గజినీకాంత్ రంగంలోకి దించారు. అలా ఈ ట్రైలర్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేష్, రజినీ కాంత్ , కేఏ పాల్ , కేసీఆర్, కేటీఆర్ లాంటి నిజ జీవిత పాత్రలను పోలిన వ్యక్తులున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన కాసేపటికే చంద్రబాబు ఏడిసిన ఎపిసోడ్ రావడంతో వర్మ దాన్ని కూడా పబ్లిసిటీకి వాడాడు. తన ట్రైలర్ చూసే ఏడుస్తున్నాడని చెబుతూ థాంక్స్ కూడా చెబుతున్నారు.

    English summary
    Ram Gopal Varma says thanks to chandrababu for crying.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X