twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భవనం 27 వ అంతస్థులో.. వర్మ ఇలా అడ్డం తిరిగాడేంటి..మియా పోర్న్ గాధ!

    |

    Recommended Video

    మియా మాల్కొవాని స్కైప్ లోనే చేసాడట వర్మ

    వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ చర్యలు ఊహాతీతం. ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో రామ్ గోపాల్ వర్మ తీసిన జీఎస్టీ చిత్ర కేసు కొత్త మలుపు చోటు చేసుకుంటోంది. సామజిక కార్యకర్త పట్ల టివి చర్చా కార్యక్రమంలో మాటజారిన వర్మ చిక్కుల్లో చిక్కుకున్నాడు. రామ్ గోపాల్ వర్మఫై హైదరాబాద్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ సారి వర్మ ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నాడు. శుక్రవారం మరో మారు పోలీస్ స్టేషన్ కు హాజరు కావలసి ఉంది. కానీ వర్మ రాకపై సందిగ్దత నెలకొని ఉంది. అంతే కాదు ఈ కేసులో తాను కొందరిపై తిరిగి కేసు పెడతా అంటూ వర్మ ఘాటుగా స్పందించాడు. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న ఓ ఛానల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు.

    వివాదాలు కొత్త కాదు

    వివాదాలు కొత్త కాదు

    రామ్ గోపాల్ వర్మ కు వివాదాలు కొత్త కాదు. గతంలో కూడా వర్మ అనేక వివాదభరిత చిత్రాలు చేసాడు. కానీ జీఎస్టీ వివాదం ముదిరినంతగా మరే వివాదం వర్మకు చిక్కులు తెచ్చిపెట్టలేదు. మియా మాల్కోవాతో పోర్న్ గాధలు మొదలుపెట్టడంతో వర్మకు ఉచ్చు బిగుసుకుంటోంది.

    పోర్న్ లో వేలు పెట్టాడు

    పోర్న్ లో వేలు పెట్టాడు

    వర్మ గతంలో రాజకీయ, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కాంట్రవర్షియల్ మూవీస్ చేసారు. కానీ మియా మాల్కోవా వంటి పోర్న్ పాతో సినిమా చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నానని బహిరంగంగా చెప్పడంతో ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. దీనికి తోడు ఓ టివి ఛానల్ లో ప్రజా కార్యకర్తపై దురుసుగా మాట్లాడడంతో వర్మ తీవ్రంగా చిక్కుల్లో చిక్కుకుపోయారు.

    కేసు నమోదు

    కేసు నమోదు

    ప్రజా కార్యకర్త దేవి దర్శకుడు వర్మపై హైదరాబాద్ లో కేసు నమోదు చేసింది. హైదరాబాద్ పోలీస్ లు వర్మ కేసుని సీరియస్ గా తీసుకున్నారు.

     విచారణ మొదలు

    విచారణ మొదలు

    ఈ కేసులో ఇప్పటికే పోలీస్ లు వర్మని విచారించారు. మరో మారు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. విచారణలో జీఎస్టీ గురించి పోలీస్ లు పలు వివరాలు రాబట్టారు.

    మియా మాల్కొవాని స్కైప్ లోనే

    మియా మాల్కొవాని స్కైప్ లోనే

    విచారణ లో భాగంగా వర్మ తాను జీఎస్టీ చిత్రాన్ని నేరుగా చిత్రీకరించలేదని, స్కైప్ లో దర్శకత్వం వహించానని పోలీస్ లకు వర్మ తెలిపాడు. ఈ విషయంలో నిజానిజాల్ని తెలుసుకునే ప్రయత్నం పోలీస్ లు చేస్తున్నారు.

     ఛానల్ పై క్రిమినల్ కేసులు

    ఛానల్ పై క్రిమినల్ కేసులు

    జీఎస్టీ కేసులో వర్మ కూడా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ ఘాటుగానే స్పందిస్తునాడు. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న ఓ ఛానల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నట్లు వర్మ తెలిపాడు.

    భవనం 27 వ అంతస్థులో

    భవనం 27 వ అంతస్థులో

    సదరు ఛానల్ తనని సైకోగ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి వారిని కాల్చేయాలి అంటూ వ్యాఖ్యానిస్తోంది. ఆ ఛానల్ పిచ్చి కథనాన్ని ముంబై లోని భవనం 27 వ అంతస్థు టెర్రస్ పై కూర్చుని ఎంజాయ్ చేస్తున్నానని వర్మ ట్వీట్ చేసారు.

    విచారణకు డౌటే.. అది అవాస్తవం

    విచారణకు డౌటే.. అది అవాస్తవం

    జీఎస్టీ కేసులో విచారణలో భాగంగా వర్మ శుక్రవారం పోలీస్ ల ముందు హాజరు కావలసి ఉంది. కానీ తాను ముంబై లో ఉన్న కారణంగా నేడు విచారణకు రావడంలేదని వర్మ పోలీస్ లకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సోమవారం హాజరవుతానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సిందే అని పోలీస్ లు తనని హెచ్చరించినట్లు వస్తున్న వార్తలని వర్మ ఖండించారు.

    English summary
    Ram Gopal Varma second day enquiry on GST. He may not to attend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X