మాజీ మంత్రి అండతో వర్మ

ఇక ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా హెడ్ లైన్స్ కెక్కే వర్మ ఇప్పుడు రణ్ పైరుతో దానిపైనే యుద్దం ప్రకటించనున్నాడు. ఇదే విషయాన్ని వర్మ తన బ్లాగ్ లో ప్రస్తావిస్తూ...తను తర్వాత తీస్తున్న చిత్రం పేరు రణ్ అనీ ప్రకటించాడు. రణ్ అర్దాన్ని కొన్ని భారీ స్దాయిలో ఆర్గనైజ్ చేయబడుతున్న కొన్ని గ్రూపుల మధ్య యుధ్థం గా వర్ణించాడు. ఇక ఈ చిత్రంలో న్యూస్ ఛానెల్స్, పేపర్లు కలసి బ్రేకింగ్ న్యూస్ కోసం వారిలో వారు చేసే పోరాటాల్ని,చీప్ జిమ్మిక్స్ ని బయిటపెడతానంటున్నాడు. మనిషి కుక్కని కరిస్తే న్యూస్ అంటారని, అదే పిల్లి కుక్కను కరిస్తే బ్రేకింగ్ న్యూస్ అంటారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ న్యూస్ ఛానెల్స్ టీవీ సీరియల్స్, థ్రిల్లర్స్ కన్నా మంచి ఎంటర్ టైన్ మెంట్ ని ఇస్తాయంటూ విమర్శించాడు. తమ సర్కులేషన్, టీరీపీ రేటింగ్స్ పెంచుకునేందుకు అవి ఎంతకైనా దిగజారుతున్నాయని అదే సబ్జెక్టు అనీ చెప్పుకొచ్చాడు.ఇక టీఆర్పీల మాట దేముడెరుగు కానీ పబ్లిసిటీ కోసం ఎంతకైనా వర్మ దిగజారుతాడనే విషయం ఈ సంఘటనతో రుజువు అవుతుందని అంతా అంటున్నారు.


Click it and Unblock the Notifications











