వెనకడుగేసిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరు మార్చుతూ సంచలనం
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి వెనక్కి తగ్గాడు. ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పేరును మార్పు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. తీరా రిలీజ్ దగ్గర పడ్డాక వర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ ఆ సినిమాకు వర్మ పెట్టిన కొత్త టైటిల్ ఏంటి? అదెలా ఉంది? ఆ వివరాలు చూద్దామా..

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదలకు ముందే అగ్గి
ఇప్పటిదాకా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించాయి. ఆమ్మో! వర్మ, ఎప్పుడెలాంటి అప్‌డేట్ ఇస్తాడో, ఎవరిపై ఎలాంటి బాంబు వేస్తాడో అని భయపడ్డారు రాజకీయ ప్రముఖులు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై విడుదలకు ముందే అగ్గి రాజుకుంది.

పోలీస్ కేసు.. పలు అభ్యంతరాలు
చంద్రబాబు, లోకేష్ బాబు, కేఏ పాల్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ఇలా ఏ ఒక్క రాజకీయ ప్రముఖుడినీ వదలకుండా తన అప్‌డేట్స్‌తో అందరికీ చుక్కలు చూపించాడు వర్మ. ముఖ్యంగా ఒక పార్టీ వర్గానికి ముచ్చెమటలు పెట్టించాడు. దీంతో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై పోలీస్ కేసు నమోదైంది. అలాగే ఈ సినిమా పేరు అభ్యంతరకరంగా ఉందంటూ నిరసనలు మొదలయ్యాయి.

సినిమా విడుదలకు బ్రేక్ పడే పరిస్థితులు.. దిగొచ్చిన వర్మ
మరోవైపు ఎంతమంది ఏం చెప్పినా.. తన సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూ చెబుతూ వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ బయటకు వదులుతూ సంచలనం సృష్టించాడు. దీంతో ఈ సినిమాపై వ్యతిరేఖత పెరుగుతూ వచ్చింది. ఈ తరుణంలో సినిమా విడుదలకు బ్రేక్ పడే పరిస్థితులు కనిపించాయి. దీంతో తాజాగా వర్మ ఓ మెట్టు కిందకు దిగాడు.

విడుదలకు ఒకరోజు ముందు
ఈ మేరకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టైటిల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నాడు. రేపే (నవంబర్ 29న) విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో.. వర్మ ఇలా ఒకరోజు ముందు టైటిల్‌ని మార్చుతూ కొత్త టైటిల్ ప్రకటించడం జరిగింది.
Recommended Video

వర్మకు ఉపశమనం లభించేనా..?
‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చుతూ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త టైటిల్ తోనే సెన్సార్ బోర్డ్‌కు అనుమతికి వెళ్లనున్నారు వర్మ. చూస్తే ఆయన చెప్పిన విడుదల తేదీకి ఒక్కరోజే సమయం ఉంది. చూడాలి మరి ఈ పరిస్థితుల్లో సెన్సార్ నుంచి వర్మకు ఉపశమనం లభిస్తుందా? లేదా? అనేది.


Click it and Unblock the Notifications