For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పప్పు లాంటి అబ్బాయితో రామ్ గోపాల్ వర్మ రచ్చ.. సెన్సేషనల్ వీడియో వైరల్

  |

  వివాదం, సంచలనం అంటే ఎప్పుడూ ముందుండే రామ్ గోపాల్ వర్మ ఈ సారి మరింత రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఓ వర్గం రాజకీయ నాయకులకు చుక్కలు చూపిస్తున్నాడు వర్మ. ఈ మేరకు ఆయన విడుదల చేస్తున్న అప్‌డేట్స్ అన్నీ ఇటు ప్రేక్షకుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బయటకు మాత్రం కాంట్రవర్సీ లేదంటూనే పలు సంచలనాలకు నాంది పలుకుతున్నాడు వర్మ. ఈ మేరకు తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి పోతే..

   చంద్రబాబు, నారా లోకేష్.. అచ్చు గుద్దినట్లు దించేసిన వర్మ

  చంద్రబాబు, నారా లోకేష్.. అచ్చు గుద్దినట్లు దించేసిన వర్మ

  'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ద్వారా సరికొత్త సంచలనానికి తెరలేపాలని భావించిన వర్మ.. నటీనటుల విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ నేపథ్యమున్న సినిమా కావడంతో చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కెఏ పాల్ ఇలా అన్ని క్యారెక్టర్లకు అచ్చు గుద్దినట్లు వారి లాగే ఉండే నటులను ఎంపిక చేశాడు. ఇక వారి వారి సంచలన అప్‌డేట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు వర్మ.

  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

  ఇటీవలే తన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ పాత్రలపై చిత్రీకరించిన పప్పు సాంగ్ రిలీజ్ చేశాడు వర్మ. ఆ సాంగ్‌లో 'సైకిల్' గురించిన అన్ని అంశాలను ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరైతే ఈ పాటపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

  ఎవ్వరెలా అనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఆ ఇద్దరితో కలిసి

  ఎవ్వరెలా అనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఆ ఇద్దరితో కలిసి

  ఇక తన సినిమా, విడుదలైన పాట పట్ల ఎవ్వరెలా అనుకుంటే నాకేంటి అన్నట్లుగా అదే ఇద్దరు నటులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు వర్మ. చంద్రబాబును, నారా లోకేష్‌ని పోలిన ఆ ఇద్దరు నటులతో స్టెప్పులేశాడు ఈ వివాదాస్పద దర్శకుడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.

  వర్మకు ఓవర్ యాక్షన్ ఎక్కువైందా?

  వర్మకు ఓవర్ యాక్షన్ ఎక్కువైందా?

  స్లోగా సాగే ఈ పాటకు వర్మ స్లో మోషన్‌లో స్టెప్పులేస్తుంటే చుట్టూ ఉన్న వారంతా అరుపులు,కేకలు పెట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూసి ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. వర్మకు ఓవర్ యాక్షన్ ఎక్కువైందనే వాదన కూడా వినిపిస్తుండటం విశేషం.

  Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!

  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీ

  ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. రాజకీయ వర్గాలను కుదిపేస్తూ వర్మ విడుదల చేస్తున్న అప్‌డేట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.

  వర్మ కావాలనే ఇలా చేస్తున్నాడా..?

  వర్మ కావాలనే ఇలా చేస్తున్నాడా..?

  రామ్ గోపాల్ వర్మ కావాలనే ఇలా చేస్తున్నాడంటూ మరో వాదన బయటకొస్తోంది. తన స్వార్థం కోసం రెండు కులాలు, వ్యక్తులను వాడుకొని వారిపై బురద జల్లుతున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తన వ్యాపారం, సంపాదన కోసం ఇతరుల పరువు ప్రతిష్టలను వర్మ ఎలా వాడుకుంటాడని ఇకొందరు ప్రశ్నిస్తున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయమై ఇప్పటికే వర్మపై పోలీస్ కేసు కూడా నమోదైంది.

  English summary
  Ashok Galla, son of Jayadev Galla is going to make his screen debut. This film grandly launched on November 10th in Ramanaidu Studios.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X