అల్లు అర్జున్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్.. చిరంజీవి అభిమాలు షాక్
వివాదాల వీరుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి దుమారం రేపాడు. ఎప్పుడూ ఏదో ఒక హాట్ ఇష్యూ క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఆయన మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కామెంట్ చేసిన తీరు చూసి మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి పోతే..

సోషల్ మీడియా అస్త్రాలు.. వర్మ చురకలు
నానాటికీ విస్తరిస్తున్న సోషల్ మీడియా ఈ ప్రపంచాన్ని కుగ్రామం చేసింది. ప్రపంచమంతా సోషల్ మీడియా మత్తులో మునిగిపోతోంది. ఈ నేపథ్యంలో అదే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు, కామెంట్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. తాను అనుకున్నది ఓపెన్‌గా చెప్పేస్తూ చురకలు అంటిస్తున్నారు.

మెగా హీరోల జోలి తీసిన వర్మ
ఈ మేరకు తాజాగా మెగా హీరోల జోలి తీస్తూ సంచలన కామెంట్స్ చేశారు. మెగా కుటుంబంలో నిజమైన పవర్ స్టార్ అల్లు అర్జున్ అంటూ సరికొత్త ఇష్యూకి తెరలేపారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ జనాల్లోకి జొప్పించడంతో సినీ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

అల్లు అర్జున్ గురించి వర్మ.. మరి రామ్ చరణ్
అల్లు రామలింగయ్యకు నిజమైన వారుసుడు అల్లు అర్జున్ మాత్రమే అని తెలిపిన వర్మ.. అతనే నిజమైన మెగా పవర్ స్టార్ అని వ్యాఖ్యానించాడు. ఓ సూపర్ స్టార్‌గా, మెగా ఫ్యాన్స్‌ను మెప్పించే హీరోగా నిలిచింది అల్లు అర్జున్ మాత్రమే అన్నారు. మెగా పవర్ స్టార్ అని రామ్ చరణ్‌ని చెప్పుకుంటాం. ఇప్పుడు వర్మ దీన్నే అల్లు అర్జున్‌కి ఆపాదించడం హాట్ టాపిక్ అయింది. ఇది చూసి మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.

చిరంజీవి, రామ్ చరణ్ కలెక్షన్స్ బీట్.. ఈ పరిస్థితుల్లో
మరోవైపు తాజాగా అల్లు అర్జున్ తాజా సినిమా ‘అల వైకుంఠపురములో' సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన సినిమాల కలెక్షన్స్ బీట్ చేస్తూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలో రామ్ గోపాల్ వర్మ మెగా హీరోలపై పడటం హాట్ హాట్ చర్చలకు దారితీసింది.

‘అల వైకుంఠపురములో' మూవీ
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందింది 'అల వైకుంఠపురములో' సినిమా. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు కీలకపాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications











