రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: పులులు సింహం అంటూ.. సోనియా గాంధీని వదల్లేదుగా!
టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తరచూ స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతుంటాడు. అదే సమయంలో పలుమార్లు కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. అయినప్పటికీ నిత్యం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిండెంట్‌గా ఎంపికైన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోనియా గాంధీని కూడా వాడుతూ ట్వీటాడు. ఆ వివరాలు మీకోసం!

అలాంటి సినిమాలతో హాట్ టాపిక్‌గా
కెరీర్ ఆరంభంలో గొప్ప గొప్ప సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే సున్నితమైన అంశాలను తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. తద్వారా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

మా ఎన్నికలపై తనదైన శైలి ట్వీట్స్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నిక ఒకటి. దీని కోసం అప్పుడే నలుగురు ప్రముఖులు పోటీలో ఉండడం.. విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ దీనిపై స్పందించాడు. నాన్ లోకల్ అని విమర్శలు ఎదుర్కొంటోన్న ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా ఎన్నో ట్వీట్లు చేసి హాట్ టాపిక్ అయ్యాడు.

టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్ రెడ్డి
చాలా రోజులుగా సాగుతూ వస్తోన్న కీలకమైన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ శనివారం సాయంత్రం పూర్తి చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు జాతీయ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన కూడా వెలువడింది. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రేవంత్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఎంపికవడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ యంగ్ లీడర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది. ఈ నేపథ్యంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దీనిపై స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వరుస పోస్టులతో టీపీసీసీ కొత్త చైర్మన్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పులులు సింహం అంటూ కామెంట్లు
రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంపై స్పందించిన రాంగోపాల్ వర్మ.. ట్విట్టర్‌లో 'ఫైనల్‌గా సింహంలాంటి రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులకు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు ఈ సింహాన్ని (రేవంత్ రెడ్డి) చూసి పులులన్నీ భయపడిపోతాయి' అంటూ పోస్టు పెట్టాడు. దీంతో ఈ ట్వీట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

సోనియా, రాహుల్ గాంధీని వదల్లేదు
ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని అభినందిస్తూ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు. అందులో 'సింహంలాంటి రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై చాలా రోజుల తర్వాత ఇష్టం పెరిగింది. హేయ్ రాహుల్ గాంధీ.. నువ్వు మీ అమ్మ సోనియా గాంధీ మంచి పని చేశారు' అంటూ పేర్కొన్నాడు. దీంతో వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.


Click it and Unblock the Notifications











