టికెట్ల వివాదంపై ఆర్జీవీ సంచలనం.. తగ్గింపుపై లాజిక్ ఏమిటి?.. ఏమీ తెలియదంటూనే షాకింగ్ గా!
ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. సినీ రంగం నుంచి పలువురు నటులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ అంశం మీద స్పందించిన వర్మ ఇప్పుడు ఏకంగా వీడియో విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

కమిటీ ఏర్పాటు చేసి
సినిమా టికెట్ రేట్ల వివాదాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఎగ్జిబిటర్లు తమ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు సమావేశమై చర్చించారు. మరో పక్క ఏపీ ఫిలిం ఛాంబర్ నుంచి ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఆలోచనలో ఉంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినీ రంగంలోని ఎవరూ ఈ విషయంపై ఇకపై వ్యాఖ్యలు చేయొద్దని కూడా సూచించారు.

యూట్యూబ్ ఛానల్ వేదిక
ఈ క్రమంలో మిగతా ఎవరూ స్పందించ లేదు కానీ తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా టికెట్ల అంశంపై స్పందించారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే ఒకటి రెండు సార్లు మీడియా ముఖంగా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆదివారం తన అభిప్రాయాల్ని ఆయన వ్యక్తం చేశారు.

నేనెవరినీ తప్పు పట్టడం లేదు
''నేనెప్పుడూ ప్రభుత్వ పాలసీలు, రాజకీయాలను పెద్దగా పట్టించుకోను, నాకు అస్సలు వాటిపై అవగాహన లేదు. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్‌పైనా స్పష్టత ఉందో లేదో చెప్పలేను, కానీ సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా, కామన్ మ్యాన్‌గా నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. నేనెవరినీ తప్పు పట్టడం లేదు. ఓ మ్యాన్యుఫ్యాక్చరర్ తాను తయారు చేసిన వస్తువును పలు రకాల ఫ్యాక్టర్స్‌ను బట్టి రేటు నిర్ణయిస్తాడు. ఆ ధర కస్టమర్ కు నచ్చితే వస్తువులు కొనుక్కుంటాడు. ఇష్టం లేకపోతే మానేస్తాడు. ఒకవేళ ఆ వస్తువు అమ్ముడుపోతే సంబంధిత ట్యాక్స్ ప్రభుత్వానికి చేరుతుంది'' అని అన్నారు.

మేకింగ్ కాస్ట్ కిందకే
'' ఒకచోట ఎవడో ఒకడు 50 రూపాయలకు ఇడ్లీ అమ్ముకుంటాడు. వాడి పక్కనే మరొక హోటల్ పెట్టి తన స్టైల్ వేరు అంటూ అదే ఇడ్లీ ని 500 రూపాయలకు అమ్ముతాడు. అయితే 500 రూపాయలు పెట్టి ఇడ్లీ తినాలా? లేదా 50 రూపాయలు పెట్టి ఇడ్లీ తినాలా అనేది తినే వాడి ఇష్టం. ఒకవేళ వాడికి స్థోమత లేకపోతే కొనుక్కోడు. అంతే కానీ కచ్చితంగా కొనాల్సిందే అని చెప్పి ఎవరూ గన్ పెట్టి బెదిరించరు'', ''అలాగే సినిమా హీరోలకు 70 శాతం, మేకింగ్ కి 30 శాతం ఖర్చు అవుతుందని పేర్ని నాని, అనిల్ లాంటి వాళ్లు అంటున్నారు. కానీ అది ఫండమెంటల్ గా రాంగ్. అసలు మేకింగ్ కాస్ట్ అంటే ఏమిటి ? హీరోలు డబ్బులు ఇవ్వడం కూడా మేకింగ్ కాస్ట్ కిందకే వస్తుందని ఆయ్న అన్నారు.

ప్లాప్ అవచ్చు, హిట్ అవచ్చు
''సినిమా టికెట్ రేట్ల విషయానికొస్తే.. ఉదాహరణకు తెలుగు సినిమా మార్కెట్ రూ.100 కోట్లు ఉందనకుంటున్న రోజుల్లో దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా తీశారు. తమ ప్రొడక్ట్‌పై ఉన్న నమ్మకంతో, సూపర్ క్వాలిటీతో సినిమా తీస్తే మార్కెట్‌ను అధిగమించవచ్చని అలా చేస్తుంటారు. అది ప్లాప్ అవచ్చు, హిట్ అవచ్చు, బాహుబలి హిట్ అయింది కాబట్టి మొత్తం ఇండస్ట్రీకే పేరొస్తుంది. టాలీవుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం 'బాహుబలి''' అన్నారు. ప్లాప్ అయితే రాజమౌళి, శోభుకే నష్టం'' అన్నారు. మొత్తం మీద వర్మ చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











